CM kcr Phone to Chiranjeevi:అగ్ర కథానాయకుడు చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఇటీవల చిరంజీవికి కరోనా సోకడంతో కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
తనకు కరోనా సోకినట్లు చిరంజీవి బుధవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.
చిరంజీవి 'ఆచార్య' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. దీనితోపాటే గాడ్‌ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ నటిస్తారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: మెగాస్టార్ చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్