ETV Bharat / city

ఆగస్టు 15న.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి: కిషన్ రెడ్డి

KISHAN REDDY: 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా.. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాన్ని విజయవంతం చేసి.. జాతీయ పతాకం స్ఫూర్తిని బలంగా చాటాలన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి వేళ.. ఆగస్టు రెండో తేదీన దిల్లీ వేదికగా పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

KISHAN REDDY
కిషన్ రెడ్డి
author img

By

Published : Jul 31, 2022, 4:04 PM IST

ఆగస్టు 15న.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి: కిషన్ రెడ్డి

KISHAN REDDY: 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. త్యాగధనుల గురించి తెలుసుకునేలా కార్యక్రమాలు చేపట్టామని.. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 2న పింగళి వెంకయ్య శత జయంతి వేడుకలను దిల్లీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్​లోని పింగళి స్వగ్రామమైన కృష్ణా జిల్లాలోని భట్లపెనుమర్రు వెళ్లి కుటుంబసభ్యులను కలిసి.. ప్రధాని తరఫున ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులను ప్రధాని, అమిత్ షా సన్మానిస్తారని వెల్లడించారు. దిల్లీలో పింగళి ఫొటోతో‌ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తామని అలాగే.. ఆయన రూపొందించిన జాతీయ జెండాను ప్రదర్శిస్తామని తెలిపారు. ఆగస్టు 2న పింగళి జయంతి సభ వేదికపై పాటను విడుదల చేస్తామని ప్రకటించారు.

ఆగస్టు 13-15 వరకు దేశంలో ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. 'హర్ ఘర్ తిరంగా-ఘర్ ఘర్ తిరంగా' పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇళ్లపై జెండా ఎగురవేయాలని కోరారు. ఆగస్టు 3న దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి విజయ్‌ చౌక్ వరకు యాత్ర ఉంటుందని తెలిపారు. మోటార్ సైకిల్‌పై తిరంగా యాత్రలో ఎంపీలు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆగస్టు 14న 'పాక్‌ విభజన్ కా‌ విదుష్ కా స్మృతి దివస్' పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 14న రాత్రి అందరూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న మహనీయుల విగ్రహాల వద్ద నివాళులర్పించాలని.. జాతీయ జెండాలు అన్ని తపాలా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. లంబసింగిలో రూ.35 కోట్లతో అల్లూరి మ్యూజియం నిర్మిస్తున్నామని ప్రకటించారు.

PHOTOGRAPHERS CARNIVAL: ఏపీలోని విజయవాడలో తెలుగు రాష్ట్రాల ఫొటోగ్రాఫర్స్ కార్నివాల్​ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన కెమెరాలు, వాటి పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము‌ వీర్రాజు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.