ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించనున్నారు. కర్ఫ్యూపై కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉండనుంది. అత్యవసర సేవలు, ప్రభుత్వ కార్యకలాపాలు, వైద్య సేవలకు మినహాయింపు ఇచ్చారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి : 'సీపీ ధైర్యం చెప్పడం వల్లే తొందరగా కోలుకున్నాం'