ETV Bharat / city

వృద్ధురాలి పట్ల కఠినంగా వ్యవహరించిన కండక్టర్​... - సిద్దిపేట డిపో బస్సు

సికింద్రాబాద్​లోని జేబీఎస్​లో​ కండక్టర్​ ఓ వృద్ధురాలి పట్ల కఠినంగా వ్యవహరించాడు. నడిచేందుకు కూడా ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని బస్సు నుంచి దింపేశాడు. కరోనా లక్షణాలున్నాయని అనుమానించి బస్సులో నుంచి దిగాలని హెచ్చరించాడు.

bus conductor rash behaviour with old women in jbs

author img

By

Published : Nov 11, 2020, 9:27 PM IST

సికింద్రాబాద్ జేబీఎస్​లో సిద్దిపేటకు చెందిన బస్సులో నుంచి కరోనా లక్షణాలు ఉన్న ఓ వృద్ధురాలి పట్ల కండక్టర్ కఠినంగా వ్యవహరించాడు. సిద్దిపేటకు వెళ్లేందుకు వృద్ధురాలు బస్సు ఎక్కగా... అక్కడే దింపేశాడు. నడవడానికి సైతం ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని ఏమాత్రం మనస్సాక్షి లేకుండా కిందకి దింపేశాడని ప్రయాణికులు ఆరోపించారు.

ఆరోగ్య పరిస్థితి నిమిత్తం పరీక్షలు చేయించుకునేందుకు హైదరాబాద్​కు వచ్చి తిరిగి సిద్దిపేటకు వెళ్లేందుకు జేబీఎస్ వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలికి కిందికి దింపడం పట్ల ఇతర ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై జేబీఎస్ డిపో మేనేజర్ ప్రణీత్​ను వివరణ కోరగా... అలాంటి విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.

ఇదీ చూడండి: ఆ పెళ్లికి సినిమా ఫక్కీలో అడ్డంకులు... చివరికి ఏమైందంటే...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.