ETV Bharat / city

mp arvind on paddy procurement: 'కోటి ఎకరాల్లో పంట పండినా కొంటామన్నారు.. ఇప్పుడేమైంది' - mp arvind speaks on paddy procurement

నాడు కోటి ఎకరాల్లో పంట పండినా కొంటామన్న కేసీఆర్​.. కేంద్రం కేవలం రబీ పంటను కొనమంటేనే ఎందుకు (mp arvind on paddy procurement) ఉలిక్కిపడుతున్నారని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ప్రశ్నించారు. కేసీఆర్​, కేటీఆర్​ కనుసన్నల్లో వరి బ్లాక్​ మార్కెట్​ నడుస్తోందని ఆయన ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలు (mp arvind speaks on farm laws) వస్తే ఈ దుకాణం బందవుతుందనే ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు.

MP ARVIND
MP ARVIND
author img

By

Published : Sep 28, 2021, 9:17 PM IST

కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే కొనమని (mp arvind on paddy procurement) మాత్రమే చెప్పిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌ స్పష్టం చేశారు. గతంలో చాలాసార్లు కోటి ఎకరాల్లో వరి పంట పండినా.. కొంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కేవలం రబీ పంటను కొనమంటేనే ఉలిక్కిపడ్డారని (mp arvind fires on kcr) ఎద్దేవా చేశారు. తెలంగాణలో వరిసాగును ప్రోత్సాహించాలని.. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. కల్వకుంట్ల కుటుంబం జేబులు నింపేందుకు రైతులు వరి పండిస్తోన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

భాజపా బలోపేతం అవుతుందనే భయంతో బలహీనపడిన కాంగ్రెస్‌ను బతికించేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌ నాటకం ఆడుతున్నారని ఎంపీ అర్వింద్​ విమర్శించారు. రాహుల్‌ గాంధీ సక్కగా లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉపయోగం లేదని విమర్శించారు.

గత ఏడేళ్లలో తెలంగాణకు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న అర్వింద్​.. తామే కేంద్రాన్ని, రాష్ట్రాన్ని నడుపుతున్నామని చెప్పకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రాన్ని నడిపే సత్తా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముతున్నారో కేటీఆర్‌ సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్​ డిమాండ్‌ చేశారు. కొకైన్‌ నుంచి కాళేశ్వరం వరకు తెరాస అవినీతి, అక్రమాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.

'ఎంత వరి పండినా కొనుక్కుంటాం.. తెలంగాణే తింటది. ఎగుమతులు చేస్తాం.. తెలంగాణ సోనా అనే బ్రాండ్​ పేరుతో ఎగుమతి చేస్తామని గతంలో చెప్పారు. ఆ తెలివితేటలు పెంచుకోవాలనీ అన్నారు. వరికి బ్లాక్​ మార్కెట్​ జరుగుతోంది. కేసీఆర్​, కేటీఆర్​ కనుసన్నల్లో మాఫియా నడుస్తోంది. అందుకనే మక్కలు, పసుపు, పత్తి, సన్​ప్లవర్​, చెరకు.. పండిచొద్దని చెప్పి.. అందరినీ వరి వేయమన్నాడు. ఇది అతిపెద్ద కుంభకోణం. (mp arvind speaks on farm laws) నూతన వ్యవసాయ చట్టాలు వస్తే ఈ దుకాణం బందవుతుంది.'

- ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌

MP ARVIND: 'కోటి ఎకరాల్లో పంట పండినా కొంటామన్నారు.. ఇప్పుడేమైంది'

ఇదీచూడండి: Cm Kcr On Paddy: ధాన్యం మొత్తం సేకరించండి... కేంద్రానికి మరోసారి సీఎం విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.