మెట్టుగూడ డివిజన్ భాజపా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన శారదా మల్లేష్.. తార్నాక డివిజన్ భాజపా అధ్యక్షుడు రాము మధ్య వివాదం చెలరేగింది. లాలాపేట్‌లో జరిగిన ఆరెస్సెస్ సమావేశంలో తమను వేదికపైకి పిలవలేదని శారదా మల్లేష్ ఆగ్రహించారు.
శారద, ఆమె భర్త మల్లేష్, భిక్షపతి, రామారావు, మల్లికార్జున్ కలిసి డివిజన్ భాజపా అధ్యక్షుడు రాము వర్మపై తార్నాకలోని నారాయణ స్కూల్ వద్ద రహదారిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడులకు పాల్పడ్డారు.
ఇదీ చూడండి: టీసీఎస్ఎస్ అధ్యక్షుడిగా నీలం మహేందర్ ఎన్నిక