ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే ప్రకటనలు ఆర్టీసీ కార్మికులపై కొంచెం ప్రభావం కూడా చేయలేకపోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోవడం లేదన్నారు. చినజీయర్ స్వామి అక్షింతలు.. హైకోర్టు అక్షింతలు ఒకటేనని కేసీఆర్ భావిస్తున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిందని.. ఈ అంశంపై కేంద్రాన్ని కలుస్తామని తెలిపారు.
ఇవీచూడండి: ఆర్టీసీ సమ్మెకు అన్నివర్గాల మద్దతు: కోదండరాం