Bathukamma celebrations in Australia: ACT తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఎదుట ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అక్కడి తెలుగు వారు చీరలు, పంచెలు కట్టుకొని కార్యక్రమానికి హాజరు కాగా.. వాతావరణమంతా సందడిగా మారింది. అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు పూలను బతుకమ్మలుగా పేర్చి ఆడిపాడటంతో కాన్బెర్రాలోని పార్లమెంట్ పరిసర ప్రాంతం ఒక్కసారిగా తెలంగాణ వాతావరణాన్ని ప్రతిబింబించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు సింగర్ మను పలు పాటలు పాడి అందరినీ ఉత్సాహపరిచారు. దక్షిణ భారతదేశం తరఫు ఒక పండుగను మొదటిసారిగా ఆస్ట్రేలియా పార్లమెంట్నందు నిర్వహించిన ఘనత తెలుగు వారికి దక్కడం గర్వకారణంగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి.. విశిష్ఠతను తెలియజేయడమే ధ్యేయంగా ఈ వేడుకలను నిర్వహించామని.. దానికి భారీగా స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగు వారితో పాటు ఆస్ట్రేలియా మహిళలు, అక్కడి ప్రజాపతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: