న్యాయవ్యవస్థను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంశంపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇప్పటికే విచారణ పూర్తయిందని...ఛార్జిషీట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ అంశంలో పూర్తి ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవీచూడండి: 'సచివాలయం కూల్చివేతలపై మీడియా బులెటిన్ ఇవ్వడానికి సిద్ధం'