ETV Bharat / city

రెండు లక్షల మంది కడుపు నింపుతున్న 'అన్నపూర్ణ' - hyderabad news

లాక్​డౌన్​ కారణంగా రాష్ట్రంలో నిరాశ్రయులైన నిరుపేదలకు అన్నపూర్ణ కేంద్రాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కడుపు నిండా తిండి పెడుతూ ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ప్రతి రోజు రెండు లక్షల మందికి ఉచితంగా భోజనం సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించింది. హైదరాబాద్​లో తినే వారి సంఖ్య పెరిగితే... మరో యాభై కేంద్రాలు పెట్టనున్నట్లు సీఎస్​ సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

annapurna canteens
అన్నపూర్ణ క్యాంటీన్లు
author img

By

Published : Apr 25, 2020, 6:09 AM IST

రెండు లక్షల మంది కడుపు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్లు

లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా శ్రమజీవుల బతుకు తెరవు బజారున పడింది. పనులు పూర్తిగా స్తంభించిన తరుణంలో.. రోజువారి కూలీలు, వలసకార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొట్ట చేతపట్టుకుని వచ్చిన వేలాది మంది..లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. భాగ్యనగరంలో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, స్థానికంగా చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న చాలా మంది బజారున పడ్డారు.

ఉచితంగానే..

లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వారెవ్వరు పస్తులుండ రాదన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంది. గతంలో అయిదు రూపాయల భోజన కేంద్రాలను నిర్వహించింది. ప్రస్తుతం వాటిని ఉచిత భోజనశాలలుగా మార్చేసింది. హరే కృష్ణ మూమెంట్, జీహెచ్‌ఎంసీలు రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత అన్నపూర్ణ కేంద్రాలు..లాక్​డౌన్‌తో చిక్కుకుపోయిన పేదల కడుపు నింపుతున్నాయి.

మూడు వందల కేంద్రాలు..

హైదరాబాద్‌తోపాటు.. మరో తొమ్మిది మున్సిపాలిటీల్లో దాదాపు మూడు వందల అన్నపూర్ణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇవే కాక నగర కూడళ్లల్లో మొబైల్‌ అన్నపూర్ణ వాహనాల ద్వారా ప్రభుత్వం భోజనం ప్యాకెట్లు సరఫరా చేస్తోంది. అటు మధ్యాహ్నం, ఇటు రాత్రి రెండు పూటల కలిసి దాదాపు రెండు లక్షల మందికి కడుపు నింపుతున్నాయి.

మరో యాభై కేంద్రాల ఏర్పాటుకు..

రోజూ ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రాలు తెరిచి ఉంటాయి. ఎక్కడైనా కేంద్రాల్లో భోజనం తినే వారి సంఖ్య పెరిగితే.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సమన్వయ కేంద్రం ద్వారా అరగంటలో అదనపు భోజనాలు సమకూర్చే విధంగా ఏర్పాట్లు చేశారు. భోజనం తినే వారి సంఖ్య పెరిగితే... మరో యాభై అన్నపూర్ణ కేంద్రాలు పెంచుతామని..ఎవరిని పస్తులుంచబోమని సీఎస్ సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాలను మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌లు పర్యవేక్షిస్తారు. ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే వీరు జోక్యం చేసుకుని పరిష్కరించి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు.

ఇవీ చూడండి: శిక్షించడంలోనే కాదు... ఆదుకోవడంలోనూ మాకు మేమే సాటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.