వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడనని అన్నారు.
అధికారుల తీరుపై తాడో పేడో తేల్చుకుంటానని పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపకపోవడం దారుణమన్నారు.
ఇదీ చదవండి: ఆ పని తప్పని చెప్పినందుకు.. పోలీసులనే కొట్టాడు