ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు సాయి ధరమ్ తేజ్‌ను(sai dharam tej accident) పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం(సెప్టెంబరు 16) తేజ్‌ను పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లారు హీరో అల్లుఅర్జున్(allu arjun sai dharam tej). బన్నీ రాకతో హాస్పిటల్ వాతావరణం అభిమానులతో నిండిపోయింది.
తేజ్(sai dharam tej health condition) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఇటీవల వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న క్రమంలో జారిపడటం వల్ల తేజ్‌కు కన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. తొలుత మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలోకు మార్చి సాయికి శస్త్రచికిత్స చేశారు.
ఇదీ చూడండి: Saidabad Rape Case: కోట్ల మనసుల కోరిక తీరింది... కామాంధుడి కథ ముగిసింది..