ETV Bharat / city

ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు - ap entrance exams extended till june 15 news

ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఏపీ ఉన్నత విద్యామండలి జూన్‌ 15 వరకు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు రేపటితో ముగియనుంది.

all-entrance-exam
ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు
author img

By

Published : May 19, 2020, 9:07 AM IST

ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఏపీ ఉన్నత విద్యామండలి జూన్‌ 15 వరకు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,56,983, ఈసెట్‌కు 33,652, ఐ సెట్‌కు 51,791, పీజీఈసెట్‌కు 19,189, లా సెట్‌కు 10,358, ఎడ్‌ సెట్‌కు 7,760 దరఖాస్తులు వచ్చాయి.

పరీక్ష కేంద్రాల కేటాయింపునకు చిరునామాల సేకరణ
10వ తరగతి విద్యార్థుల నివాసాలకు సమీపంలో పరీక్ష కేంద్రాలను కేటాయించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం వివరాలను జిల్లాలకు పంపించనుంది. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో సుమారు 60వేల మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ప్రైవేటు పాఠశాలల వివరాల కోసం విద్యార్థుల సమాచారాన్ని విద్యాధికారులకు పంపించి, చిరునామాలు తీసుకోనున్నారు. ప్రశ్నపత్రాల మార్పు అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

46 కేంద్రాల్లో ఇంటర్‌ మూల్యంకనం
ఏపీ వ్యాప్తంగా 46 కేంద్రాల్లో ఇంటర్‌ మూల్యంకనం ప్రారంభమైంది. కరోనా కారణంగా ఒక్కో జిల్లాలో 2 నుంచి 6 కేంద్రాలను ఏర్పాటు చేసి, మూల్యంకనం చేస్తున్నారు.

ఇదీ చదవండి :

తెలియని మార్గాల్లో వచ్చిన విరాళాల్లో వైకాపాకు రెండో స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.