సేకరించిన సొమ్ముతో అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడబెట్టుకున్న మరిన్ని ఆస్తుల వివరాలను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సేకరించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూములు, భవనాలు కొనుగోలు చేయడంతో పాటు.. విదేశాలకు కూడా తరలించినట్లు ఈడీ గుర్తించింది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, అవ్వా వెంకట శేషు నారాయణరావు, హేమసుందర ప్రసాద్‌ను పది రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించిన ఈడీ... ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది.
ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు మరో పద్నాలుగు రోజులు రిమాండ్ పొడిగించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు డిపాజిట్ల పేరుతో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మందిని మోసం చేసి 6 వేల 380 కోట్ల రూపాయల వసూలు చేసినట్లు ఇప్పటికే ఈడీ వెల్లడించింది. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన 4 వేల 109 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈనెల 24న ఈడీ అటాచ్ చేసింది.
ఇదీ చదవండి: అగ్రిగోల్డ్ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఈడీ