ETV Bharat / city

success story in telugu: వెన్నెల.. కత్తిసాములో "అరుంధతి".. కర్రసాములో "దేవసేన"..!! - telangana news

సవాళ్లు ఎదుర్కొంటూనే మార్షల్ ఆర్ట్స్‌ సాధన.. వివిధ క్రీడల్లో కోచ్‌గా వ్యవహరిస్తూనే ఉన్నత విద్యాభ్యాసం.. అంతేనా..? ఈతరం యువతులకు ఉండాల్సిన సమయస్ఫూర్తి, సాహసం, చురుకుదనం ఆమె సొంతం. తండ్రి ప్రోత్సాహంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని బ్లాక్‌ బెల్ట్ పట్టేసింది. ఆయన గతించాక.. తల్లితో కుటుంబ భారం పంచుకుంటోంది. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తోంది. ఇంతకీ ఎవరామె.. తెలుసుకుందాం రండి...

success story in telugu, vennela nilakanta story
కత్తిసాములో "అరుంధతి", వెన్నెల నీలకంఠ స్టోరీ
author img

By

Published : Oct 23, 2021, 2:12 PM IST

చకచకా కత్తి తిప్పుతున్న ఈమె పేరు వెన్నెల నీలకంఠ. సొంతూరు కర్ణాటకలోని మంగళూరు పక్కన చిన్నగ్రామం. విశాఖలో జరిగిన జాతీయస్థాయి కర్రసాము, కత్తిసాము, శిలంబం పోటీల్లో.. కర్రసాము, కత్తిసాము, డబుల్ కర్రసాములో పతకాలు కైవసం చేసుకుంది. చిన్నప్పటి నుంచీ మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువతో సాధన చేశానంటోంది వెన్నెల.

వెన్నెల ప్రత్యేకతలివే..

మంగళూరులో ఎంటెక్ చేస్తున్న వెన్నెల.. తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్‌పై దృష్టి పెట్టింది. జూడో, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. తర్వాత.. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. యోగా, స్కేటింగ్, బాక్సింగ్, ఆర్చరీ.. వీటన్నింటిలోనూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు, సర్టిఫికెట్లు సొంతం చేసుకుంది.

బాధ్యతల భారం ఉన్నా..

అయితే.. తండ్రి మరణం తర్వాత.. తల్లి కూలిపనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వెన్నెల తమ్ముళ్లు పాఠశాల విద్యలో ఉన్నారు. దీంతో.. బాధ్యతల భారం తల్లిపై పడకుండా తోడుగా నిలిచింది. ఎన్.ఐ.టి.లో తరగతులకు హాజరవుతూనే.. తనకు తెలిసిన విద్యల్లో పిల్లలకు మెళకువలు నేర్పుతోంది. చిన్నవయసులో అన్ని బాధ్యతలెలా అన్ని ‌అడిగితే.. సమస్యలు వస్తేనే కదా జీవితపాఠాలు తెలుస్తాయ్ అంటోంది వెన్నెల. ఆత్మవిశ్వాసం పెరగడానికి, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి.. మార్షల్ ఆర్ట్స్ ఎంతో సాయపడిందని చెబుతోంది.

ఉదయం నాలుగు గంటల నుంచి నా దినచర్య మొదలవుతుంది. యోగా, తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌ తరగతులు నిర్వహిస్తా. ఆపై కళాశాల తరగతులకు హాజరవుతా. సాయంత్రం కాలేజీ అయ్యాక 8 గంటల వరకు మళ్లీ శిక్షణ ఇస్తా. అది అయ్యాక నా చదువు. ఇదే నా దినచర్య. అలాగని నా సాధనను పక్కన పెట్టలేదు. రోజూ దానికీ సమయాన్ని కేటాయిస్తా. కొత్త టెక్నిక్‌లను ప్రయత్నిస్తా. మార్షల్‌ ఆర్ట్స్‌లో నాకు చాలామంది గురువులు ఉన్నారు. వారి నుంచి ఎప్పటికప్పుడు సూచనలు తీసుకుంటా. అయిదేళ్ల నుంచి కత్తిసాము, కర్రసాములను సాధన చేస్తున్నా. మా పూర్వీకుల మూలాలు తమిళనాడులో ఉన్నాయి. అందుకే వీటిపైౖ మక్కువ ఏర్పడిందేమో అనిపిస్తుంటుంది.

-వెన్నెల నీలకంఠ

తల్లిదండ్రులు ఆడపిల్లల్ని సున్నితంగా చూడకుండా.. అనుకోని పరిస్థితుల్లో వేగంగా స్పందించడమెలాగో నేర్పాలని సూచిస్తోంది వెన్నెల. మార్షల్ ఆర్ట్స్‌ సాధనలో గాయాలు సహజమనీ.. మానసిక బలం అక్కడినుంచే మొదలవుతుందని చెబుతోంది. ఎంటెక్ పూర్తయిన తర్వాత పరిశోధకురాలిగా స్థిరపడతానంటున్న వెన్నెల.. సాయుధ దళాల్లో చేరేందుకూ సిద్ధమేనంటోంది. అలాంటి వెన్నెల మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశిద్దాం.

ప్రతి విషయాన్నీ ఓ పాఠంగా తీసుకుంటా. అలా నాన్న ప్రోత్సాహమే నన్ను నడిపిస్తోంది! అందుకే అమ్మాయిలు, యువతులకు ప్రత్యేక శిక్షణనిస్తా. అమ్మాయిలను చిన్నప్పటి నుంచి సున్నితంగా పెంచుతారు. హఠాత్తుగా ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ఇబ్బంది పడేది వాళ్లే. అందుకే వాళ్లకు ఉపయోగపడేలా త్వరగా స్పందించి ఎదుర్కోవడం, తిప్పికొట్టడం వంటి వాటిని నేర్పిస్తుంటా. ఇవి శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా మారుస్తాయి. నేర్చుకునేటప్పుడు, సాధన చేసేటప్పుడు గాయాలు సహజం. కానీ చిన్న వాటికే భయపడితే భవిష్యత్‌లో కష్టమని వాళ్లకి, వాళ్ల అమ్మానాన్నలకి వివరిస్తా. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడమే సమాజానికి నావంతు సాయంగా భావిస్తా. నా కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలన్నది లక్ష్యం. అందుకే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలపై దృష్టిపెట్టా. పరిశోధనపైనా ఆసక్తి ఉంది. రిసెర్చర్‌గా స్థిరపడాలనుకుంటున్నా.

-వెన్నెల నీలకంఠ

కత్తిసాములో "అరుంధతి"

ఇదీ చదవండి : ktr and raja singh tweets: కేటీఆర్‌, రాజాసింగ్‌ మధ్య ట్వీట్ వార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.