ఇవీ చూడండి:నకిలీ వీసాలు ఎక్కడివి?
అశోక్ హాజరవుతారా? లేదా?
ఐటీ గ్రిడ్స్ సంస్థ కేసులో పురోగతి కరవైంది. కంపెనీ సీఈఓ అశోక్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా... ఇంత వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఉదయం నుంచి దర్యాప్తు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆయన చెబితే తప్ప ఏం జరిగిందనేది తెలిసే అవకాశం లేదు.
ఐటీ గ్రిడ్స్ కేసులో సిట్ దర్యాప్తు
ఐటీ గ్రిడ్స్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. సీఈఓ అశోక్ ఇవాళ విచారణకు హాజరు కావాలని రెండు రోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది. అశోక్‌ను విచారించేందుకు ఉదయం నుంచి అధికారులు సిద్ధంగా ఉన్నారు. స్టీఫెన్ రవీంద్ర, రోహిణి ప్రియదర్శిని, శ్వేతా రెడ్డి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ చౌర్యం చేసినట్లు దర్యాప్తులో తేలింది. కంప్యూటర్లలో కొంత డేటాను తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం ఎక్కడి నుంచి తీసుకున్నారనేది అశోక్ వెల్లడిస్తేనే కేసులో పురోగతి లభిస్తుందని సిట్ భావిస్తోంది. అసలు అశోక్ హజరవుతారా లేదా అన్నది సందేహం.
ఇవీ చూడండి:నకిలీ వీసాలు ఎక్కడివి?
sample description
Last Updated : Mar 13, 2019, 5:51 PM IST