ETV Bharat / city

భీంపూర్​లో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​ మండలంలో పులి సంచారంతో స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికే కంజి శివారులో ఓ లేగదూడను హతం చేసినట్లు వారు పేర్కొన్నారు. గ్రామాలు, పంటచేల వైపు క్రూరమృగం రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

author img

By

Published : Aug 14, 2020, 6:16 PM IST

people in adilabad district were afraid of tiger presence in distrit
భీంపూర్​లో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​ మండలంలో మళ్లీ పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. మండలంలోని కరంజి-టీ అటవీశివారులోని పులిదాడిలో లేగదూడ హతమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనాస్థలాన్ని సందర్శించిన అటవీ అధికారులు పులి దాడిని నిర్ధరించారు.

మండల సరిహద్దు మహారాష్ట్ర పెన్​గంగా నదికి ఆనుకుని ఉన్న తిప్పేశ్వర్​ అభయారణ్యం నుంచి పులి ఇటువైపు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెన్​గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. పులి నది దాటే పరిస్థితి లేక ఇటువైపే స్థావరం ఏర్పాటు చేసుకుంటుందని స్థానికులు భయపడుతున్నారు. పులి.. గ్రామాలు, పంటచేల వైపు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.