ETV Bharat / business

అదిరే ఫీచర్లతో 3 కొత్త కార్లు.. హ్యుందాయ్​ క్రెటాకు గట్టి పోటీ! - స్పోర్ట్స్​ యూటిలిటీ వెహికిల్స్ ఇండియా

ప్రస్తుతం ఎస్​యూవీల హవా కొనసాగుతోంది. ధర ఎక్కువైనా వీటివైపే మొగ్గుచూపుతున్నారు వినియోగదారులు. అందులోనూ మిడ్​సైజ్​ ఎస్​యూవీలు భారీ అమ్మకాలు నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సబ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో దూసుకెళ్తోంది హ్యుందాయ్​ క్రెటా. ఇప్పుడు ఈ కారుకు పోటీగా మార్కెట్లలోకి వివిధ కంపెనీల నుంచి కొత్త మోడళ్లు విడుదలవుతున్నాయి. వాటిలో క్రెటాకు గట్టి పోటీ ఇచ్చే కార్లు ఇవే..

upcoming hyundai creta rivals
upcoming hyundai creta rivals
author img

By

Published : Mar 19, 2023, 4:29 PM IST

Updated : Mar 19, 2023, 4:54 PM IST

ఒకప్పుడు కార్లలో ఎస్​యూవీ(స్పోర్ట్స్​ యుటిలిటీ వెహికిల్) వాహనాలకు అంతగా ఆదరణ లభించలేది కాదు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెగ్మెంట్​ వాహనాలకు క్రేజ్ పెరిగింది. ధర ఎక్కువైనా చాలా మంది ఎస్​యూవీ వాహనల వైపు మొగ్గుచూపుతున్నారు. ఒక్కప్పుడు హ్యాచ్​బ్యాక్​లకు ఎక్కువ డిమాండ్​ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎంట్రీ లెవెల్​, మిడ్​సైజ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీలు భర్తీ చేశాయి. ఈ సెగ్మెంట్​లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది కారు 'హ్యుందాయ్​​ క్రెటా'. ఈ కారుకు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. ప్రతి నెల సగటున 12,000 యూనిట్ల చొప్పున ఈ కార్లు అమ్ముడుపోతున్నాయి. దీంతో ఈ కారుకు పోటీగా మిగతా కంపెనీలు కూడా.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త మోడళ్లను మార్కెట్​లోకి విడుదల చేస్తున్నాయి. హ్యుందాయ్​​ క్రెటాకు పోటీగా.. త్వరలో భారత విపణిలోకి విడుదల కాబోయో కార్లు ఇవే..

1. కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​
ఇప్పటికే రోడ్లపై పరుగులు పెడుతోంది కియా సెల్టోస్. ఈ కారు బేసిక్​ ఫీచర్స్​లో మార్పులు చేసి ఫేస్​లిఫ్ట్​ వర్షన్​ను​ విడుదల చేయనున్నారు. ఈ కారు 2023 మధ్యలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. రీడిజైన్​ చేసిన ఎక్ట్సీరియర్​తో పాటు అడాస్​( అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ అసిస్టెంట్​ సిస్టమ్​) ఫీచర్​, సరికొత్త ఇంటీరియర్​తో ఈ కారు రానుంది. కియా సెల్టోస్ 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​తో రానుంది. ఈ ఇంజిన్​ 160 పీఎస్​ వపర్​, 253 ఎన్​ఎమ్​ టార్క్​ జనరేట్​ చేస్తుందని సమాచారం.

upcoming hyundai creta rivals
కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​

2. సిట్రియాన్ సీ3 ఎయిర్​ క్రాస్​
హ్యుందాయ్​​ క్రెటాకు పోటీగా విడుదలవునున్న మరో కారు సిట్రియాన్​ సీ3 ఎయిర్​క్రాస్. ఈ కారు 2024 ప్రథమార్ధంలో విడుదల కానుంది. సిట్రియాన్​ హ్యాచ్​బ్యాక్​ డిజైన్​ స్ఫూర్తితో ఈ కారును రూపొందించారని సమాచారం. అదిరిపోయే ఫీచర్లతో స్టైలిష్​ ఇంటిరీయర్​ను ఈ కారులో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 4.2 మీటర్లున్న ఈ కారు.. 110 హెచ్​పీ పవర్​ జనరేట్ చేయగల సామర్థమున్న 1.2 లీటర్​ టర్బో ఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​తో వస్తోంది. ఇక, ఈ కారు 5 సీట్లు, 7 సీట్ల వేరియంట్లలో అందుబాటులో ఉండనుందని సమాచారం.

upcoming hyundai creta rivals
సిట్రియాన్ సీ3 ఎయిర్​ క్రాస్​

3. హోండా మిడ్​ సైజ్​ ఎస్​యూవీ
మిడ్​ సైజ్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో హోండా నుంచి మరో కొత్త వాహనం మార్కెట్లలోకి రానుంది. ఈ కారును 2023 మధ్యలో ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత భారత్​లో విక్రయాలు మొదలుపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వాహనం హోండా సిటీ కారును రూపొందించిన ఐదో తరం ప్లాట్​ ఫాంపై తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ కారు డిజైన్​కు కూడా ఇదివరకు ఉన్న హోండా ఎస్​యూవీల తరహాలోనే ఉండనుందని తెలుస్తోంది. ఇక, ఈ కారు 1.5 లీటర్​ ఎన్​ఏ పెట్రోల్​, 1.5 లీటర్​ హైబ్రిడ్​ పెట్రోల్​ ఇంజిన్​తో వస్తోంది.

upcoming hyundai creta rivals
హోండా మిడ్​ సైజ్​ ఎస్​యూవీ
upcoming hyundai creta rivals
హ్యుందాయ్​​ క్రెటా

Last Updated : Mar 19, 2023, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.