ETV Bharat / business

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. జీవితకాల కనిష్ఠానికి రూపాయి - రుపాయి మారకం విలువ

Stock markets
భారీ నష్టాల్లో మార్కెట్లు
author img

By

Published : May 9, 2022, 9:24 AM IST

Updated : May 9, 2022, 4:00 PM IST

15:48 May 09

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్​ 365 పాయింట్లు డౌన్

సెన్సెక్స్​ 365 పాయింట్లు డౌన్: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, కీలక సంస్థల ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 365 పాయింట్ల నష్టంతో 54,470.67 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 16,301.85 వద్ద ముగిసింది.

మరోవైపు, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 57 పైసలు పతనమైంది. ప్రస్తుతం 77.47 వద్ద స్థిరపడింది. ఇది జీవిత కాల కనిష్ఠస్థాయి కావడం గమనార్హం.

10:34 May 09

సెన్సెక్స్​ 600 పాయింట్లు నష్టం: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, కీలక సంస్థల ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 600 పాయింట్ల నష్టంతో 54,233 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 178 పాయింట్లు కోల్పోయి 16,233 వద్ద కొనసాగుతోంది.

09:15 May 09

భారీ నష్టాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్​ 800 డౌన్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి కారణాలతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్​, టెక్​, ఆర్థిక రంగ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 800 పాయింట్ల మేర నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టీ 16,200 దిగువన ట్రేడవుతోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​.. 800లకుపైగా పాయింట్ల నష్టంతో 54,035 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 229 పాయింట్ల నష్టంతో 16,181 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి: పవర్​ గ్రిడ్​, బజాజ్​ ఆటో, యూపీఎల్​, గ్రాసిమ్​లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్​, టీసీఎస్​, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఫైనాస్​లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

జీవితకాల కనిష్ఠానికి రూపాయి: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజు రోజుకు దిగజారుతోంది. అమెరికా డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 51 పైసలు తగ్గి జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుతం రూ.77.41 వద్ద కొనసాగుతోంది.

Last Updated : May 9, 2022, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.