ETV Bharat / business

రికార్డుల మీద రికార్డులు - నూతన శిఖరాలను తాకిన సెన్సెక్స్​ & నిఫ్టీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 9:48 AM IST

Updated : Dec 5, 2023, 10:30 AM IST

Stock Market Today 5th December 2023 In Telugu : మంగళవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 69,035 వద్ద నూతన గరిష్ఠాలను తాకింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 52 పాయింట్లు వృద్ధి చెంది 20,739 వద్ద ఆల్​టైమ్ హై రికార్డ్​ను నమోదు చేసింది.

share market today 5th December 2023
stock market today 5th December 2023

Stock Market Today 5th December 2023 : దేశీయ స్టాక్​మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 69,035 వద్ద ఆల్​టైమ్​ హై రికార్డ్​ను నమోదు చేసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 52 పాయింట్లు వృద్ధి చెంది 20,739 వద్ద నూతన గరిష్ఠాలను తాకింది. దీని తరువాత కూడా బుల్​ రన్​ మరింత జోరుగా కొనసాగుతూ ఉంది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, దేశీయంగా స్థూల ఆర్థిక వృద్ధి అంచనాలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వృద్ధి చెందడం మొదలైన అంశాలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరుస్తున్నాయి. దీనితో వరుసగా 6వ రోజు కూడా దేశీయ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 199 పాయింట్లు లాభపడి 69,064 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 69 పాయింట్లు వృద్ధి చెంది 20,756 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎమ్​ అండ్ ఎమ్​, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టాటా మోటార్స్​, రిలయన్స్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : హెచ్​సీఎల్ టెక్​, ఇన్ఫోసిస్​, విప్రో, టాటా స్టీల్​, ఏసియన్ పెయింట్స్​, ఎల్​ అండ్ టీ, ఐటీసీ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు!
మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా మార్కెట్లకు బూస్ట్ ఇచ్చిందని నిపుణులు అభిప్రాయపడతున్నారు.

వడ్డీ రేట్లు పెరగకపోవచ్చు!
ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాలు ఈ డిసెంబర్​ 8న వెలువడనున్నాయి. అయితే ఈ సారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కూడా స్టాక్​ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపిస్తోంది. అయితే ద్రవ్య నిర్వహణ, రుణాల వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ గవర్నర్‌ చేసే వ్యాఖ్యలు కీలకం కానున్నాయి.

విదేశీ పెట్టుబడుల వెల్లువ!
దేశంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజే విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) రూ.2,073 కోట్లు విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

ముడిచమురు ధర
Crude Oil Prices 5th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.01 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 78.02 డాలర్లుగా ఉంది.

మహిళలకు గుడ్ న్యూస్​ - భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

కొత్త కారు కొనాలా? ఆ మోడల్​పై ఏకంగా రూ.3 లక్షలు డిస్కౌంట్​!

Last Updated : Dec 5, 2023, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.