Hyundai New Edition: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్స్.. భారత్‌లో మరో కొత్త మోడల్ కారును సోమవారం విడుదల చేసింది. 'గ్రాండ్ ఐ10 NIOS' కార్పొరేట్ ఎడిషన్ పేరుతో విడుదలైన ఈ కారు ప్రారంభ ధరను (ఎక్స్ షోరూం) రూ.6.28 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త మోడల్‌ను మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ ఎడిషన్లను విడుదల చేసింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ వేరియంట్ కారు ధర రూ.6.28 లక్షలు కాగా, ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎమ్‌టీ) ధర రూ. 6.97 లక్షలు.
ఫీచర్లు ఇవే..
- 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్
- 6.75 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- స్మార్ట్‌ఫోన్ మిర్రరింగ్ నేవిగేషన్
- ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ మిర్రర్
- బ్లాక్-పెయింటెడ్ మిర్రర్లు
- 15-అంగుళాల గన్‌మెటల్ స్టైల్ వీల్స్
- గ్లోసీ బ్లాక్ రేడియేటర్ గ్రిల్
- రెడ్ కలర్ ఇన్‌సర్ట్‌లు (సీట్లు, ఏసీ వెంట్స్, గేర్ బూట్)
"హ్యుందాయ్.. భారతదేశంలోని యువ కస్టమర్ల కోసం GRAND i10 NIOSను రూపొందించింది. ప్రారంభించినప్పటి నుంచి అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అందుకే ఇప్పుడు GRAND i10 NIOSలో హైటెక్ ఫోకస్డ్ కార్పొరేట్ ఎడిషన్‌ను పరిచయం చేస్తున్నాము" అని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: భారత్‌పై దృష్టి సారించిన యాపిల్!