PVC Aadhar Card Apply Online : 'ఆధార్ కార్డ్' ప్రతి భారతీయ పౌరుడికి చాలా అవసరం. ఇది మన గుర్తింపు కోసమే కాకుండా.. సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకూ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మనం ఆధార్ కార్డ్‌ను పొగొట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు పేపర్ రూపంలో ఉన్న కార్డ్ నలిగిపోవచ్చు. ఇటువంటి సమయాల్లో మనం పీవీసీ ఆధార్ కార్డ్‌ను(పాలీ వినైల్ క్లోరైడ్ కార్డ్) పొందొచ్చు. ఈ అవకాశాన్ని UIDAI కల్పించింది. మొదట UIDAI వెబ్సైట్ లేదంటే mAadhaar యాప్ ద్వారా ఈ పీవీసీ ఆధార్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది ఫీజికల్ కాపీ ఏ విధంగా పనిచేస్తుందో.. దానిలాగే ఉపయోగపడుతుంది. ఇప్పుడు పీవీసీ ఆధార్ కార్డ్‌ను ఎలా పొందాలో తెలుసుకుందాం.
E Aadhar Card Download PDF File : పీవీసీ ఆధార్(పాలీ వినైల్ క్లోరైడ్ కార్డ్) ఎలా పొందాలో తెలుసుకునే ముందు.. ఈ-ఆధార్ కార్డ్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
- మొదట UIDAI వెబ్‌సైట్‌కు వెళ్లాలి. (myaadhaar.uidai.gov.in)
- ఆధార్ నంబర్‌తో పాటు క్యాప్చాను ఎంటర్ చేయాలి.
- అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ పీడీఎఫ్ ఫార్మట్‌లో డౌన్లోడ్ అవుతుంది.
ఈ-ఆధార్ కార్డ్‌ను మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం..
ఈ- ఆధార్‌ను మొబైల్ యాప్‌లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో 'ఎం-ఆధార్ యాప్'ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఆధార్ కార్డ్ నంబర్, బయోమెట్రిక్స్ వివరాలతో ఈ 'ఎం-ఆధార్ యాప్'ను ఓపెన్ చేయాలి.
- అనంతరం 'మై ఆధార్' పై క్లిక్ చేయాలి.
- తరువాత 'డౌన్లోడ్ ఆధార్' కింద కనిపించే 'ఈ-ఆధార్'పై క్లిక్ చేయాలి.
- వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నాలుగు డిజిట్ల ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీ నంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం పీడీఎఫ్ ఫార్మట్లలో మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
How to Get PVC Aadhar Card : ఇప్పుడు పీవీసీ ఆధార్ కార్డ్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం..
పౌరులు తమ ఆధార్ కార్డ్‌ను పీవీసీ కార్డ్‌లోకి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తోంది UIDAI. అందుకోసం UIDAI వెబ్సైట్లోకి వెళ్లి.. రూ.50 చెల్లించడం ద్వారా పీవీసీ ఆధార్ కార్డ్‌ను పొందొచ్చు. మార్కెట్లో దొరికే ఇతర పీవీసీ కార్డ్‌ల కంటే ఇది చాలా నాణ్యంగా, దృఢంగా ఉంటుంది.
- ఈ పీవీసీ ఆధార్ కార్డ్ కోసం uidai.gov.in website లోకి వెళ్లాలి.
- మొదటగా 'మై ఆధార్ ట్యాబ్'పై క్లిక్ చేయాలి.
- అనంతరం 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్' కింద కనిపించే 'ఆర్డర్ నౌ' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత ఆధార్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి.
- "ప్రొసీడ్" పై క్లిక్ చేయాలి.
- చివరగా మన చిరునామా, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసిన అనంతరం రూ. 50 చెల్లించాలి అనే ఆప్షన్ వస్తోంది.
- పే నౌపై క్లిక్ చేసి ఆ మొత్తాన్ని చెల్లించాలి.
- మీకు ధ్రువీకరణ మెసేజ్ వస్తుంది.
- 15 పని దినాలలో మీ అడ్రెస్‌కు పీవీసీ ఆధార్ చేరుతుంది.
LIC Aadhaar Shila Policy : ఎల్ఐసీ 'సూపర్ పాలసీ'.. రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు విత్‌డ్రా!
UIDAI Warning : ఆధార్ యూజర్స్‌కు వార్నింగ్.. వాట్సాప్‌లో అలా చేస్తే..