ITR Refunds Big Update : ఆదాయపు పన్ను చెల్లింపుదారులంతా.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి.. రిఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ దాదాపు ఆరున్నర కోట్ల మంది ఐటీ రిటర్నులు(IT Returns) దాఖలు చేశారని అంచనా. ఇందులో ముందుగా రిటర్న్స్ దాఖలు చేసిన కొందరికి రిఫండ్స్ క్రెడిట్ అవుతున్నాయి. కానీ.. చాలా మంది తమకు ఇంకా అందలేదని నిరాశ చెందుతున్నారు. ఇలాంటి వారికి ఆదాయపు పన్ను శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఐటీఆర్ వెరిఫై అయిపోయాక.. పన్ను రిఫండ్స్ను కేవలం 10 రోజుల్లో క్లియర్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో.. ఇప్పటి వరకు ఎంతమందికి రిఫండ్స్ వచ్చాయనే విషయమై.. జాబితాను కూడా విడుదల చేసింది.
Income Tax Refunds Time : ఐటీ రిఫండ్స్ రావడానికి గతంలో చాలా సమయం పట్టేది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ముందు.. ఐటీ రిఫండ్ జారీ చేయడానికి దాదాపు 120 రోజుల సమయం పట్టేది. ఆ తర్వాత దాన్ని 82 రోజులకు తగ్గించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సగటు ప్రాసెసింగ్ సమయం మరింత సడలించారు. 16 రోజుల్లోనే రిటర్న్స్ క్లియర్ చేస్తామని ఐటీ శాఖ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రిటర్న్స్ సమయం మరింత తగ్గించింది. కేవలం 10 రోజుల్లో పని పూర్తి చేస్తామని ప్రకటించింది.
సాంకేతిక పరిజ్ఞానంతో తగ్గిన ఐటీఆర్ ప్రాసెసింగ్ సమయం..
Reduced ITR Processing Time : ఐటీ శాఖ.. పన్ను సంబంధిత పనిని, ITR ప్రాసెసింగ్ వేగవంతం చేయడానికి AI సాంకేతికత, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. గత నెలలో.. తన వెబ్‌సైట్‌ను కూడా రీడిజైన్ చేసి ప్రారంభించింది. ఇందులో పన్ను సంబంధిత పనుల ఫీచర్స్, లింక్‌లు ప్రముఖంగా ప్రదర్శించబడ్డాయి. ఇది వినియోగదారుల సేవలను మరింత సులభతరం చేసింది.
88% కంటే ఎక్కువ ధృవీకరించబడిన ITRలు ప్రాసెస్ అయ్యాయి.. CBDT ప్రకారం.. సెప్టెంబర్ 5, 2023 నాటికి.. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి 6.98 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. వాటిలో 6.84 కోట్ల ఐటీఆర్‌లు ధ్రువీకరించబడ్డాయి. ఈ ధ్రువీకరించిన ITRలలో 6 కోట్ల కంటే ఎక్కువ ITRలు ప్రాసెస్ అయ్యాయి. అంటే.. దాదాపు 88% కంటే ఎక్కువ ITRల ప్రాసెసింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యిందన్నమాట.
2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి రూ. 2.45 కోట్ల కంటే ఎక్కువ రిఫండ్‌లు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇప్పుడు ఐటీఆర్ పన్ను రిఫండ్ల జారీ సమయాన్ని 10 రోజులకు తగ్గిస్తున్నట్టు ప్రకటించడంతో.. మిగిలిన వాటి ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
How to Check Income Tax Refund Status : మీ 'ఐటీ రిఫండ్ స్టేటస్'.. ఈజీగా ఇలా తెలుసుకోండి!
ITR Scam : ఐటీ రిఫండ్ స్కామ్లో ఇరుక్కుపోవద్దు.. కేంద్రం హెచ్చరిక!