Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 పెరిగి.. రూ.52,230 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.882 పెరిగి.. ప్రస్తుతం రూ.60,312 గా ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.52,230గా ఉంది. కిలో వెండి ధర రూ.60,312వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,230 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,312గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,230గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,312వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.52,230 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.60,312గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,652 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.71 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.16,93,981 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.16,93,981 |
ఇథీరియం | రూ.1,31,111 |
టెథర్ | రూ.82.80 |
బినాన్స్ కాయిన్ | రూ.26,620 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.75 |
స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ 140 పాయింట్లు తగ్గుముఖం పట్టి 60,980 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 18,109 వద్ద కొనసాగుతోంది. సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ఐటీసీ లాభాల్లో ఉండగా.. భారతి ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, మారుతి, హీరో మోటార్స్ నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం తగ్గింది. ట్రేడింగ్ ప్రారంభంలో 12 పైసలు నష్టపోయి.. ప్రస్తుతం 82.71కు చేరింది.
ఇదీ చదవండి: అక్టోబర్‌లో దుమ్మురేపిన కార్ల అమ్మకాలు.. బైక్ సేల్స్ డౌన్!
బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఫీజు.. ట్విట్టర్ టాప్ మేనేజ్మెంట్ నుంచి మరొకరు ఔట్