ETV Bharat / business

Godawari E Scooter Launch : గోదావరి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్​ లాంఛ్​.. ఫీచర్స్​ అదుర్స్​.. ధర ఎంతంటే? - ఎబ్లూ స్కూటర్​ ఫీచర్స్​

Godawari E Scooter Launch : దేశీయ ఎలక్ట్రిక్​ మోటార్​ కంపెనీ గోదావరి తమ మొదటి ఈ-స్కూటర్​ను భారత మార్కెట్​లో లాంఛ్​ చేసింది. ఎబ్లూ ఫియో పేరుతో విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్​, రేంజ్​, ప్రైస్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

godawari eblu feo electric-scooter
Godawari E Scooter Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 2:25 PM IST

Godawari E Scooter Launch : గోదావరి ఎలక్ట్రిక్​ మోటార్స్​ భారత మార్కెట్​లో ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్​ను లాంఛ్​ చేసింది. గోదావరి ఆటోమొబైల్​ కంపెనీ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్​ ఇదే కావడం విశేషం. దీనిని రాయ్​పుర్​ ఫ్యాక్టరీలో తయారుచేశారు. గోదావరి ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్​ బుకింగ్స్ ఆగస్టు 15నే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 23 నుంచి వినియోగదారులకు ఈ-స్కూటర్లు డెలివరీ చేస్తున్నారు.

గోదావరి ఎబ్లూ ఫియో ఫీచర్స్
Godawari Eblu Feo Electric Scooter Features : గోదావరి ఎబ్లూ ఫియో ఈ-స్కూటర్​ను ప్రస్తుతానికి సింగిల్ వేరియంట్​లో మాత్రమే తీసుకొచ్చారు. దీనిని టైమ్​లెస్​ డిజైన్​తో, సుపీరియర్​ కంఫర్ట్​తో రూపొందించినట్లు.. గోదావరి ఎలక్ట్రిక్​ మోటార్స్ సీఈఓ హైదర్​ఖాన్​ తెలిపారు.

ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఎబ్లూ ఫియో స్కూటర్​లో టెలిస్కోపిక్​ ఫ్రంట్​ సస్పెన్షన్​, డ్యూయల్​ ట్యూబ్​ ట్విన్​ షాకర్ ఉన్నాయి. ఇవి సౌకర్యవంతమైన ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ స్కూటీలో ముందు, వెనుక భాగాల్లో CBS డిస్క్ బ్రేకులు అమర్చారు. ఇంకా దీనిలో సైడ్​ స్టాండ్ సెన్సార్ ఇండికేటర్​, బ్లూటూత్​ నేవిగేషన్​ కనెక్టివిటీ, సర్వీస్ అలర్ట్​, 7.4 అంగుళాల డిజిటల్ ఫుల్​ కలర్​ డిస్​ప్లే, రివర్స్ ఇండికేటర్​, బ్యాటరీ Soc ఇండికేటర్​, బ్యాటరీ అలర్ట్​, హెల్మెట్ ఇండికేటర్​, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి.

గోదావరి ఎబ్లూ ఫియో స్కూటర్​ రేంజ్​
Godawari Eblu Feo Electric Scooter Range : ఈ గోదావరి ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్​ స్కూటర్​లో.. 2.52 కిలోవాట్​ లిథియం-ఐయాన్​ బ్యాటరీ ప్యాక్​ను పొందుపరిచారు. ఇది 110Nm టార్క్​ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జ్​ చేస్తే, గంటకు 60 కి.మీ వేగంతో.. ఏకంగా 110 కి.మీ వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ చెబుతోంది.

గోదావరి ఎలక్ట్రిక్​ మోటార్స్ కంపెనీ ఈ స్కూటర్​తో 60 వాట్ కెపాసిటీ ఉన్న​ హోమ్ ఛార్జర్​ను కూడా అందిస్తోంది. ఇది 5 గంటల 25 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ ఛార్జ్​ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ గోదావరి ఎబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్​లో.. ఎకానమీ, నార్మల్​, పవర్​ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

గోదావరి ఎబ్లూ ఫియో డిజైన్ అండ్ కలర్​
Godawari Eblu Feo Electric Scooter Design : ఈ గోదావరి ఎబ్లూ ఫియో ఈ-స్కూటర్​.. సియాన్​ బ్లూ, వైన్​ రెడ్​, జెట్​ బ్లాక్​, టెలి గ్రై, ట్రాఫిక్ వైట్ అనే 5 రంగుల్లో లభిస్తుంది. దీనిలో హై-రిజల్యూషన్​ AHO LED హెడ్​ల్యాంప్​, LED టెయిల్ ల్యాంప్​ ఉన్నాయి. దీనిలో 12 అంగుళాల మార్చుకోగలిగిన ట్యూబ్​లైస్​ టైర్లు ఉన్నాయి. అలాగే ఈ-స్కూటర్​కు 170 mm గ్రౌండ్​ క్లియరెన్స్ ఉంది.

గోదావరి ఎబ్లూ ఫియో ధర
Godawari Eblu Feo Electric Scooter Price : గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ తమ మొదటి ఈ-స్కూటర్​ను బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దీని ధరను రూ.99,999గా నిర్ణయించింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.