ETV Bharat / business

విద్యుత్‌ వాహనాల పరుగు.. ఖరీదు ఎక్కువైనా కొనేందుకు మొగ్గు! - Are EV sales increasing in India

Electric vehicle sales: ఇంజిన్‌ మోతే లేకుండా విద్యుత్‌ వాహనాలు(ఈవీ) రహదారులపై దూసుకెళ్తున్నాయి. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలు, కార్లే కాదు.. ఆటోలు, బస్సులు కూడా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే బ్యాటరీ కలిగి ఉండే విద్యుత్‌ వాహనాలు కొంచెం ఖరీదైనా, నగరాల్లోని వాహనదారులు వీటికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

ev vehicles sales
విద్యుత్‌ వాహనాల పరుగు
author img

By

Published : Oct 27, 2022, 7:48 AM IST

Electric vehicle sales: ఇంజిన్‌ మోతే లేకుండా విద్యుత్‌ వాహనాలు(ఈవీ) రహదారులపై దూసుకెళ్తున్నాయి. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలు, కార్లే కాదు.. ఆటోలు, బస్సులు కూడా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే బ్యాటరీ కలిగి ఉండే విద్యుత్‌ వాహనాలు కొంచెం ఖరీదైనా, నగరాల్లోని వాహనదారులు వీటికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యుత్‌ వాహనాలకు జీవితకాల పన్ను మినహాయిస్తుండడం కలిసొస్తోంది. కేవలం ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ వ్యయం మాత్రమే ఉంటోంది. హైదరాబాద్‌లో చూస్తే గత మూడు నెలల్లోనే 21,000 విద్యుత్తు వాహనాలు రహదారులపైకి అదనంగా వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు నాలుగో వారం వరకు మొత్తం 38,600 విద్యుత్‌ వాహనాలు ఇక్కడ రిజిస్ట్రేషన్‌ అయ్యాయని, ఇందులో 33,000 ద్విచక్ర వాహనాలేనని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు 25వరకు విద్యుత్‌ వాహన యజమానులకు మాఫీ చేసిన జీవితకాల పన్ను మొత్తం రూ.120 కోట్లుగా ఉంది.

చలో ఈవీ...
హీరో, హోండా, బజాజ్‌లతో పాటు మరో పది కంపెనీలు విద్యుత్తు ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటికి ప్రచారం చేసేందుకు సెలబ్రిటీలను వినియోగిస్తున్నాయి. విద్యుత్‌ బైక్‌లు తయారుచేస్తున్న ఓ కంపెనీ సినీ కథానాయకుడు వెంకటేష్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. పర్యావరణ హితంగా ఉన్నందునే విద్యుత్తు కార్లు కొంటున్నట్లు ప్రైవేటు సంస్థల అధిపతులు, బ్యాంకర్లు, వ్యాపారులు, సంపన్న యువత చెబుతున్నారు.

electric vehicles sales
విద్యుత్ వాహనాల కొనుగోళ్లు

కొద్దిరోజుల కిందట తెలంగాణ రాష్ట్రమంత్రి ఒకరు తన వ్యక్తిగత సిబ్బందికి విద్యుత్‌ బైకులు ఇప్పించారు. ఈ కార్లలో చూస్తే టాటా వాహనాలు ముందుండగా, తర్వాతి స్థానాల్లో కియా, మారుతీ సుజుకీ ఉన్నాయి. మారుతీ సుజుకీ కొద్దినెలల కిందట గ్రాండ్‌ విటారా పేరుతో విద్యుత్‌/పెట్రోలుతో నడిచే హైబ్రిడ్‌ కారును విడుదల చేసింది. ఈ కారు బ్యాటరీతో నడుస్తుంది. ఒకవేళ అవసరమైతే పెట్రోలుతో కూడా ప్రయాణించే వీలుంది. ద్విచక్ర వాహనదారులు బ్యాటరీలను ఇళ్ల ఆవరణల్లోనే ఛార్జింగ్‌ చేసుకుంటుండగా.. కార్ల యజమానులు మాత్రం ఛార్జింగ్‌ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి
విద్యుత్‌ వాహనాలు నడిపే వారికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాల్సిందే. గరిష్ఠంగా 25 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించే విద్యుత్తు వాహనాలకే లైసెన్స్‌ అవసరం ఉండదు. అంతకుమించిన వేగంతో వెళ్లే సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు నడిపేవారికి తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. కొన్ని కంపెనీలు అమ్మకాలు పెంచుకునేందుకు ‘మా విద్యుత్‌ బైక్‌/స్కూటర్‌ కొంటే.. బండి నంబర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు.. నడిపే వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరం లేద’ని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది సరికాదని.. వాహన సామర్థ్యాన్ని అనుసరించే డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరమని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.