స్మార్ట్ఫోన్లపై అదిరే ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చాయి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. వేసవి కాలం సందర్భంగా రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. 'గ్రేట్ సమ్మర్ సేల్' పేరిట అమెజాన్ సేల్ నిర్వహించనుండగా.. 'బిగ్ సేవింగ్ డేస్' పేరుతో ఫ్లిప్‌కార్ట్ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు రెండు సంస్థలు సేల్స్ వివరాలను వెల్లడించాయి.
Amazon Summer Sale 2023 : ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్.. 'గ్రేట్ సమ్మర్ సేల్ 2023' పేరుతో సేల్‌ను మే 4 నుంచి నిర్వహించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లతో పాటు కంప్యూటర్లు, గృహోపకరణ వస్తువులపై ఆఫర్లను ప్రకటించాయి. మే 4న సేల్ ప్రారంభం కానుండగా.. ప్రైమ్ సభ్యులకు 12 గంటలు ముందుగానే అందుబాటులోకి వస్తుంది. ఈ ఆఫర్లతో పాటు ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
- రూ. 72,999 విలువ గల సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్22 ఫోన్ బ్యాంక్ ఆఫర్లతో కేవలం రూ. 51,999 కే అందుబాటులో ఉండనుంది.
- వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ 5జీ రూ. 17,499కే అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర 18,999.
- ఇటీవల లాంఛ్ అయిన IQOO Z6 లైట్ ఫోన్ రూ. 12,499కే లభించనుంది. దీని అసలు ధర రూ. 13,999.
- అమెజాన్ సేల్‌లో రూ. 34,999 విలువ గల సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్20 FE 5జీ కేవలం రూ. 24,999కే లభించనుంది.
- వన్‌ప్లస్ 11 5జీ ప్రస్తుతం రూ. 56,999 ఉండగా.. ఆఫర్లో 55,999కి అందుబాటులో ఉండనుంది.
- బడ్జెట్ ధరల్లో రియల్మీ నార్జో 50i ప్రైమ్ రూ,8,999కి లాంఛ్ కాగా.. ఆఫర్లో కేవలం రూ, 6,999కి లభించనుంది.
Flipkart Big Saving Days 2023 : అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా భారీ డిస్కౌంట్లతో మరోసారి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. మే 4 నుంచి ఈ డిస్కౌంట్ సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లతో పాటు కంప్యూటర్లు, గృహోపకరణ వస్తువులపై డిస్కౌంట్‌ను ప్రకటించింది.
రియల్మీ GT నియో 3T
స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పాటు 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తున్న.. ఈ ఫోన్‌ను రూ. 20,000 లోపు ఫోన్లలో ఇది బెస్ట్‌గా చెప్పవచ్చు. ఇందులో ఫొటోలు అద్భుతంగా వస్తాయి. 6 జీబీ ర్యామ్, 128 స్టోరేజీ గల ఈ ఫోన్ రూ. 19,999కే ఆఫర్లో అందుబాటులో ఉండనుంది.
గూగుల్ పిక్సెల్ 6a
మిడ్ రేంజ్ బడ్జెట్లో అందుబాటులో ఉన్న మరో ఫోన్ గూగుల్ పిక్సెల్ 6a. ఇది డెవలప్డు టెన్సార్ జీ2 చిప్సెట్తో వస్తుంది. ఇందులో కెమెరా అధ్బుతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ రూ. 25,999కి అందుబాటులో ఉండనుంది.
పోకో X5 ప్రో
పోకో తాజాగా స్నాప్‌డ్రాగన్ 778 తో X5 ప్రో ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఇందులో ఉన్న 64 ఎంపీ ప్రైమరీ కెమెరా అద్భుతమైన ఫొటోలను తీస్తుంది.