ETV Bharat / business

క్రిప్టో మార్కెట్ ఢమాల్‌.. బిలియన్ డాలర్లు లాస్.. మనం మాత్రం సేఫ్!

క్రిప్టో కరెన్సీలు గణనీయంగా పతనమవుతున్నాయి. క్రిప్టో ఎక్స్ఛేంజీలు దివాలా ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఏడాది క్రితం బిట్‌ కాయిన్‌ 69 వేల డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకగా... ఆ తర్వాత 75 శాతం పతనమైంది. అయితే, కేంద్ర ప్రభుత్వం, ఆర్​బీఐ ముందుచూపు ఫలితంగా క్రిప్టోల విషయంలో భారత్ సురక్షితంగా ఉండగలిగింది.

Is crypto investment Safe
Is crypto investment Safe
author img

By

Published : Nov 14, 2022, 9:26 PM IST

ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిప్టోలో మదుపు చేసిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బిలియన్ల డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, భారత్‌ మాత్రం అందుకు అతీతంగా నిలుస్తోంది. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం, సెబీ సహా ఇతర నియంత్రణా సంస్థల ముందుచూపే అందుకు కారణం. దేశంలో క్రిప్టో కరెన్సీలను గుర్తించేందుకు ఆర్‌బీఐ ముందు నుంచీ నిరాకరిస్తూనే వస్తోంది. వీటిలో మదుపు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు హెచ్చరించింది. సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండడంతో పన్నులతో గిరాకీపై దెబ్బ కొట్టింది. ఆ చర్యలే ఇప్పుడు మన భారతీయ మదుపర్లను రక్షించాయి.

ఏడాది క్రితం 3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న క్రిప్టో మార్కెట్‌ విలువ ఇప్పుడు ఒక ట్రిలియన్‌ డాలర్ల దిగువకు చేరింది. కస్టమర్ల ఉపసంహరణల తాకిడితో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ఎఫ్‌టీఎక్స్‌ దివాలా తీసే పరిస్థితి తలెత్తింది. అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పరిగణిస్తున్న బిట్‌కాయిన్‌ ఓ దశలో 16 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 16 వేల 500 డాలర్లకు అటుఇటుగా ట్రేడవుతోంది. ఏడాది క్రితం ఇదే బిట్‌ కాయిన్‌ 69 వేల డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నాటి నుంచి ఇప్పటి వరకు 75 శాతం పతనమైంది.

స్వయంగా ఎఫ్‌టీఎక్స్‌ సహ- వ్యవస్థాపకుడు శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రైడ్‌ 16 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. ఇది క్రిప్టో మదుపర్ల సెంటిమెంటును పూర్తిగా దెబ్బతీసింది. ఏడాది క్రితం అందరి నోటా ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీలపై ప్రభుత్వాలు ఎలాంటి కచ్చితమైన వైఖరి ప్రకటించకపోవడంతో క్రమంగా సెంటిమెంటు దెబ్బతింటూ వచ్చింది. దీనికి వడ్డీరేట్ల పెంపు, ఉక్రెయిన్‌ యుద్ధం, ఇంధన ధరల సంక్షోభం, చైనాలో లాక్‌డౌన్‌ల వంటి సవాళ్లు కూడా ఎదురుకావడంతో ఒడుదొడుకులు కొనసాగుతూ వస్తున్నాయి. తాజాగా ఎఫ్‌టీఎక్స్‌ పతనంతో క్రిప్టో పరిశ్రమలో ఉన్న లోపాలు ప్రస్ఫుటమయ్యాయి. మదుపర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడులను ఉపసహరించుకునేందుకు ఎగబడుతున్నారు.

భారత్‌లో ఆర్‌బీఐ మొదట్నుంటి క్రిప్టో కరెన్సీలను వ్యతిరేకిస్తూ వస్తోంది. వీటితో ఉన్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన భారత ప్రభుత్వం క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్ను విధించింది. డిజిటల్‌ కరెన్సీతో జరిగే ఆస్తుల బదిలీపై ఒక శాతం టీడీఎస్‌ విధించింది. అంతేకాకుండా ఈ ఆదాయంపై పన్ను మినహాయింపు మాత్రం ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌లో స్పష్టం చేశారు. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా పన్ను భారం అధికమై చాలా మంది క్రిప్టోల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. కొత్తగా మదుపు చేయడానికి వెనుకాడారు. ప్రస్తుతం భారత్‌లో మదుపర్ల పెట్టుబడుల్లో కేవలం 3 శాతం మాత్రమే క్రిప్టోల్లో ఉన్నాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రిప్టో ఎక్స్ఛేంజీ సంస్థలపై నియంత్రణ సంస్థలు సోదాలు జరిపాయి. జీఎస్‌టీ ఎగవేసిన సంస్థలపై చర్యలకు దిగాయి. ఈ చర్యల వల్లే ఇప్పుడు మన మదుపర్ల సంపద సురక్షితంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.