స్టాక్ మార్కెట్లు లాభాల పంట పండించాయి. మంగళవారం సెషన్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 248 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠమైన 49,517 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 79 పాయింట్ల మేర పెరిగి కొత్త రికార్డు స్థాయి అయిన 14,563 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో..
ఇవాళ్టి సెషన్లో సెన్సెక్స్ 49,079 పాయింట్ల వద్ద కనిష్టాన్ని.. 49,569 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ 14,432 పాయింట్ల అత్యల్ప స్థాయిని, 14,590 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
కేంద్ర బడ్జెట్‌పై ఆశలు.. టీకా పంపిణీ సానుకూలతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి.
లాభనష్టాల్లో..
ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ షేర్లు లాభాలు గడించాయి.
ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, టైటాన్, కోటక్‌బ్యాంకు షేర్లు నష్టాలను చవిచూశాయి.
ఇదీ చదవండి: పసిడి బాండ్ల జారీ షురూ- వారికి ప్రత్యేక డిస్కౌంట్