భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 465 పాయింట్లు క్షీణించి 48,253 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 14,496 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివివే..
బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలను ఆర్జించాయి.
సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మారుతి, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.