ETV Bharat / business

Stock market: వరుసగా ఐదో సెషన్​లోనూ మార్కెట్లు ముందుకే - సెన్సెక్స్​

Stock markets live updates
స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్స్​
author img

By

Published : Jan 13, 2022, 9:25 AM IST

Updated : Jan 13, 2022, 3:40 PM IST

15:37 January 13

మార్కెట్లకు లాభాలు..

వరుసగా ఐదో సెషన్​లోనూ దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 85, నిఫ్టీ 46 పాయింట్లు చొప్పున పెరిగాయి.

ఇంట్రాడేలో తీవ్ర ఒడుదొడుకుల ట్రేడింగ్​ సాగింది.

విప్రో, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, కోటక్​ మహీంద్రా, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ నష్టపోయాయి.

టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, కోల్​ ఇండియా, దివీస్​ ల్యాబ్స్​, యూపీఎల్​, సన్​ ఫార్మా రాణించాయి.

10:43 January 13

కరోనా భయాలతో నష్టాల్లోకి మార్కెట్లు

దేశంలో ఒక్కరోజే దాదాపు 2.5 లక్షల కేసులు నమోదవటం స్టాక్​ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా భయాలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆరంభ ట్రేడింగ్​లో స్వల్ప లాభంతో ప్రారంభమైనప్పటికీ క్రమంలో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, బ్యాంక్​, ఆటో, స్థిరాస్తి రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

  • బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​.. 144 పాయింట్ల నష్టంతో 61,006 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 30 పాయింట్లు పడిపోయి 18,182 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

టాటా స్టీల్​, కోల్​ ఇండియా, జేఎస్​డబ్ల్యూ, సన్​ ఫార్మా, పవర్​ గ్రిడ్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

విప్రో, టాటా మోటార్స్​, హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:11 January 13

Stock market live: స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్స్​

Stock markets live updates: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు, వెంటాడుతున్న కరోనా భయాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలకు, నష్టాలకు మధ్య ఊగిసలాడుతున్నాయి.

  • బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 40 పాయింట్ల వృద్ధితో 61,190 పాయింట్ల వద్ద ట్రేడ్​ అవుతోంది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 18,225 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

టీసీఎస్​, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, ఇన్ఫోసిస్​, టాటా స్టీల్​, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

విప్రో, టాటా మోటార్స్​, ఐసీఐసీ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jan 13, 2022, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.