దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 52,275 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 11 పాయింట్ల కోల్పోయి 15,740 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆర్థిక షేర్లు నష్టపోగా.. ఐటీ షేర్లు లాభాలను గడించాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గిన.. సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలకు చేరువైన నేపథ్యంలో మదుపర్లు లాభాలకు స్వీకరణకు మొగ్గుచూపడం కారణంగా సూచీలు స్తబ్దుగా కదిలాడాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,432 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,135 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,778 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,680 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభ నష్టాల్లోనివి ఇవే..
- టెక్ మహీంద్ర, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్‌టెక్, టైటాన్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్ షేర్లు లాభాలను గడించాయి.
- కొటక్ మహీంద్ర బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్‌ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టపోయాయి.