ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లపై బేర్​ పంజా- సెన్సెక్స్​ 500 డౌన్​ - స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్

stock markets
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Nov 11, 2021, 9:39 AM IST

Updated : Nov 11, 2021, 2:47 PM IST

14:43 November 11

బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 572 పాయింట్లు నష్టపోయి 59,780 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ 50.. 174 పాయింట్లు పతనమై 17,843 వద్ద కొనసాగుతోంది. 

బ్యాంకు, ఎఫ్​ఎంసీజీ, ఐటీ రంగ షేర్లు డీలా పడ్డాయి. లోహ రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

12:26 November 11

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, అమెరికా వినియోగదారుల ధరల సూచీ 6.2 శాతం పెరగడం సహా ద్రవ్యోల్బణ భయాలతో సూచీలు కుదేలవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 500 పాయింట్లకుపైగా క్షీణించి.. 59,843 కదలాడుతోంది. నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి.. 17,860 వద్ద ట్రేడవుతోంది. 

సెన్సెక్స్​ 30 సూచీలో టైటాన్​, టాటాస్టీల్​,​ రిలయన్స్​ మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి.

10:17 November 11

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్​ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు కుంగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 400 పాయింట్లకుపైగా కోల్పోయి.. 59,879 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 146 పాయింట్లు నష్టపోయి.. 17,870 వద్ద కదలాడుతోంది.

సెన్సెక్స్​ 30 సూచీలో ఎల్​ అండ్​ టీ, టైటాన్​, టాటాస్టీల్​,​ మారుతి, ఇండస్​ ఇండ్​​ బ్యాంకు, రిలయన్స్ మినహా.. మిగిలినవి నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:03 November 11

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు (Stock Market) గురువారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ ప్రస్తుతం 250 పాయింట్లకుపైగా నష్టపోయి.. 60,050 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 90 పాయింట్లకుపైగా కోల్పోయి 17,913 వద్ద కొనసాగుతోంది.

గతవారం నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ సోమవారం లాభాలు ఆర్జించాయి. మళ్లీ వరుసగా రెండు రోజులు పతనం అయ్యాయి. ఈ సెషన్​లోనూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Last Updated : Nov 11, 2021, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.