స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్సీ-సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా పతనమై 57,093 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సైతం.. 150 పాయింట్లకుపైగా కోల్పోయి.. 17,059 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
30 షేర్ల సూచీలో బజాబ్ఫిన్సెర్వ్, బజాబ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్పెయింట్ మినహా మిగతా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాలకు కారణాలివే..!
ఆర్బీఐ ద్రవ్యపరపతి విదాన సమీక్షా సమావేశం నేడు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్భణాన్ని స్థిరంగా ఉంచేందుకు వడ్డీరేట్లను పెంచుతారు అనే ఊహాగానాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతుడటం వల్ల మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.