ETV Bharat / business

కరోనా దెబ్బ: సెన్సెక్స్ 465 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెషన్ ప్రారంభంలో లాభపడిన సెన్సెక్స్​ చివరకు 465 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ నేడు 137 పాయింట్లు కోల్పోయింది.

bse, nse
దెబ్బతిన్న సెంటిమెంట్లు- నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
author img

By

Published : May 4, 2021, 3:39 PM IST

స్టాక్​మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఆరంభం సెషన్​లో లాభాల దిశగా అడుగులు వేసిన సూచీలు క్రమక్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 465 పాయింట్ల క్షీణించి 48,253 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 14,496 వద్ద ముగిసింది.

స్థానిక లాక్​డౌన్​ల కారణంగా దేశంలో నిరుద్యోగం పెరగడం, ఏప్రిల్​ నెలలో తయారీ రంగం పీఎంఐ 8 నెలల కనిష్ఠానికి చేరుకోవడం లాంటి వార్తలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమ్మకాలు భారీగా పెరిగాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 48,996 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 48,149 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 14,723 పాయింట్ల అత్యధిక స్థాయి, 14,461 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

బజాజ్​ ఫినాన్స్​, ఎస్​బీఐ, ఓఎన్​జీసీ, కోటక్​ మహీంద్ర బ్యాంక్, టీసీఎస్​, టెక్​ మహీంద్ర షేర్లు లాభాలను ఆర్జించాయి.

సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్​, రిలయన్స్​, ఎం అండ్​ ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, మారుతి, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.