ETV Bharat / business

కొనసాగిన బుల్​ జోరు- 51వేల ఎగువకు సెన్సెక్స్ - స్టాక్​ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు పెరిగి 51,039కి చేరింది. నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 15,097వద్ద ముగిసింది.

stock market closing with positive note
కొనసాగిన బుల్​ జోరు.. టాప్​లో ఎన్​టీపీసీ
author img

By

Published : Feb 25, 2021, 3:41 PM IST

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 257 పాయింట్లు బలపడి 51,039వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 115 పాయింట్లకుపైగా పెరిగి 15,097వద్దకు చేరింది.

అంతర్జాతీయ పరిణామాలు, ఫిబ్రవరి డెరివేటీవ్స్‌ ముగింపు వంటి కారణాలతో సూచీలు లాభాలను ఆర్జించాయి. మరో వైపు బ్యాంకింగ్ షేర్లు దూకుడు, విదేశీ పెట్టుబడులు మార్కెట్​కు దన్నుగా నిలిచాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 51,386 పాయింట్ల అత్యధిక స్థాయి, 50,991 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,176 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,065 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్,ఓన్​జీసీ, ఎన్​టీపీసీ, రిలయన్స్​, పవర్​గ్రిడ్, సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్​ షేర్లు ఎక్కువగా లాభాలను గడించాయి.

ఐసీఐసీఐ బ్యాంక్​, టైటాన్​, ఎల్ అండ్​ టీ, హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ మహేంద్ర​, నెస్లే ఇండియా, హిందుస్థాన్​ యూనిలీవర్​ షేర్లు నష్టపోయాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.