ETV Bharat / business

లాభాల్లో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్​ 376 ప్లస్ - మార్కెట్ ఈరోజు

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 121 పాయింట్లు పుంజుకుంది.

STOCK MARKETS
లాభాల్లో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్​
author img

By

Published : Oct 27, 2020, 3:45 PM IST

ఒడుదొడుకుల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 376​ పాయింట్లు బలపడి.. 40,522 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 121 పాయింట్ల వృద్ధితో 11,889 వద్దకు చేరింది. బ్యాంకింగ్ షేర్ల దన్నుతో మార్కెట్లు లాభాలతో సెషన్​ను ముగించాయి.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 40,555 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,978 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,899 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,723 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

కోటక్​ బ్యాంక్ షేర్లు దాదాపు 11 శాతం లాభాలను గడించాయి.​ నెస్లే ఇండియా, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఫినాన్స్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఎంఅండ్​ఎం, హెచ్​సీఎల్​టెక్, ఐటీసీ, సన్​ఫార్మా, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా.. టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు నష్టాలను చవిచూశాయి.

రూపాయి, ముడి చమురు..

కరెన్సీ మార్కెట్లో రూపాయి బుధవారం 13 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.71 వద్ద స్థిరపడింది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 0.52 శాతం పడిపోయింది. బ్యారెల్ ముడి చమురు ధర 40.67 డాలర్లుగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.