ఒత్తిడి లోనూ బజాజ్ షేర్ల జోరు..
చివరి గంటలో నమోదైన అమ్మకాల ఒత్తిడి స్టాక్ మార్కెట్లకు నష్టాలను మిగిల్చింది. సెన్సెక్స్ 244 పాయింట్లు తగ్గి 47,705 వద్దకు చేరింది. నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 14,296 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. వాహన షేర్లు రాణించాయి.
లాభనష్టాల్లోనివి ఇవే..
డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, ఎం&ఎం, మారుతీ సుజుకీ షేర్లు లాభాలను గడించాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్‌టెక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయి.