దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాలు వెంటాడాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 87 పాయింట్లు తగ్గి 49,771 వద్ద సెషన్‌ను ముగించింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ స్వల్పంగా 8 పాయింట్లు కోల్పోయి 14,736 వద్ద స్థిరపడింది.
రోజురోజుకు పెరుగుతోన్న కరోనా కేసులకు తోడు.. అంతర్జాతీయ ప్రతికూలతలతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషించారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,281 పాయింట్ల అత్యధిక స్థాయి.. 49,879 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,764 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 14,598 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లో..
టెక్ఎం, సన్‌ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు రాణించాయి.
ఇండస్ఇండ్ బ్యాంకు, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు నష్టపోయాయి.
ఇదీ చదవండి: కరోనా పంజా: అప్పులు ఆకాశానికి- పొదుపు పాతాళానికి!