వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు (Stocks Today). బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 29 పాయింట్లు తగ్గి 58,250 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,353 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు సహా.. మదుపరుల అప్రమత్తత కారణంగా నష్టాలు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 58,372 పాయింట్ల అత్యధిక స్థాయి, 57,924 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,383 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,254 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, టైటాన్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ లాభాలను గడించాయి.
నెస్లే, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, టీసీఎస్ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్) లాభాలను గడించింది. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి: Govt hikes MSP: పొద్దుతిరుగుడు మద్దతు ధర భారీగా పెంచిన కేంద్రం