బుల్ దూకుడు..
స్టాక్ మార్కెట్లలో బుల్ దూకుడు ప్రదర్శిస్తోంది. సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా లాభంతో సరికొత్త రికార్డు స్థాయి అయిన 47,707 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లకుపైగా పెరిగి నూతన గరిష్ఠమైన 13,964 వద్ద కొనసాగుతోంది.
బ్యాంకింగ్, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలు, విదేశీ మదుపరుల నుంచి వస్తున్న పెట్టుబడుల మద్దతు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
- ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ దాదాపు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.22 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 51.06 డాలర్లకు చేరింది.