అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, దేశీయ బ్యాంకింగ్, లోహ, ఆటో పరిశ్రమల షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ఇంట్రాడేలో 38,130 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరకు 298 పాయింట్లు కోల్పోయి 37,880 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 11,235 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి..
భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, హెచ్సీఎస్ టెక్, హెచ్యూఎల్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో సుమారు 5.05 శాతం లాభపడ్డాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంకు, టాటా మోటర్స్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటా స్టీల్ సంస్థలు సుమారు 6.15 శాతం మేర నష్టపోయాయి.
రూపాయి..
రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే రూ.71.04 వద్ద ట్రేడవుతోంది.