పసిడి, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 233 తగ్గి రూ.41,565కు చేరుకుంది.
"దిల్లీలో 24 కారెట్ల బంగారం ధర రూ.233 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర తగ్గడమే ఇందుకు కారణం. కరోనా వైరస్ను నియంత్రించగలమన్న చైనా ప్రకటన తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి."
-తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యురిటీస్
వెండి ధరలు కూడా సోమవారం తగ్గాయి. కిలో వెండిపై రూ.157 తగ్గి రూ.47,170 చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,579 డాలర్లుగా ఉంది. వెండి ఔన్సుకు 17.74 డాలర్ల వద్ద కొనసాగుతోంది.