ETV Bharat / business

'మార్కెట్‌ విలువ'లో డ్రాగన్‌ దూకుడు - చైనా మార్కెట్‌ కేపిటలైజేషన్

మార్కెట్​ విలువ పరంగా చైనా దూసుకుపోతోంది. మనం మాత్రం వెనుకబడిపోయాం. దశాబ్దకాలం క్రితం మార్కెట్​ క్యాప్​ విషయంలో మనకన్నా తక్కువగా ఉన్న చైనా మనల్ని ఎలా మించిపోగలిగింది. మనం ఎక్కడ వెనుకబడిపోయాం.. అనే అంశాలను పంచుకున్నారు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ స్ట్రాటజీ హెడ్‌ వినోద్‌ కర్కి

market capitalization
'మార్కెట్‌ విలువ'లో డ్రాగన్‌ దూకుడు
author img

By

Published : Oct 11, 2020, 6:01 AM IST

దశాబ్దకాలం క్రితం పొరుగుదేశమైన చైనా మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిటలైజేషన్‌) మన దేశంతో పోల్చిచూసినప్పుడు ఎంతో వెనుక కనిపించేది. కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. ఆ దేశం మార్కెట్‌ క్యాప్‌ విషయంలో దూసుకుపోతోంది. మనం మాత్రం వెనుకబడిపోయాం. తత్ఫలితంగా విదేశీ పెట్టుబడులను చైనా స్థాయిలో మనం ఆకర్షించలేని పరిస్థితి ఏర్పడుతోంది. 2006లో మనదేశ మార్కెట్‌ క్యాప్‌ 74,500 కోట్ల డాలర్లు కాగా, ఆ సమయంలో చైనాది 40,700 కోట్ల డాలర్లు మాత్రమే. ప్రస్తుతం చైనా మార్కెట్‌ క్యాప్‌ 10 లక్షల కోట్ల డాలర్లు అయితే మనది 2.11 లక్షల కోట్ల డాలర్లు మాత్రమే. చైనా మనల్ని ఎలా మించిపోగలిగింది, మనం ఎక్కడ వెనుకబడిపోయాం... అనే అంశాలను ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ స్ట్రాటజీ హెడ్‌ వినోద్‌ కర్కి వివరించారు. ఆ విశేషాలు..

ఇటీవల చైనా 'మార్కెట్‌ క్యాప్‌' ఎంతో వేగంగా పెరుగుతోంది. దీనికేమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?

జవాబు: చైనా ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లలో ఎంతో పెద్దదైంది. అదే స్థాయిలో చైనా మార్కెట్‌ విలువ పెరగలేదు. అందుకు కారణం అక్కడి ఎన్నో పెద్ద కంపెనీలు స్టాక్‌మార్కెట్లో నమోదు కాకపోవటమే. గత దశాబ్దకాలంలో చైనాలో అలీబాబా, టెన్సెంట్‌ వంటి టెక్నాలజీ కంపెనీలు, ఐసీబీసీ వంటి ఆర్థిక సంస్థలు ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదిగాయి. ఇటువంటి కంపెనీల్లో కొన్ని ఇటీవల స్టాక్‌మార్కెట్‌కు వస్తున్నాయి. అందువల్ల చైనా మార్కెట్‌ కేపిటలైజేషన్‌ పెరుగుతూ వస్తోంది. దాంతో పాటే చైనా మార్కెట్‌ క్యాప్‌-టు-జీడీపీ (జీడీపీలో మార్కెట్‌ కేపిటలైజేషన్‌ శాతం) కూడా పెరుగుతూ ప్రపంచ దేశాల సగటుకు దగ్గరవుతోంది.

ప్రస్తుతం చైనా మార్కెట్‌ క్యాప్‌- టు- జీడీపీ 50 శాతంగా ఉంది. కానీ ప్రపంచ సగటు మాత్రం 80 శాతం కాగా, మన దేశంలో విషయంలో ఇది 77 శాతం ఉంది. దీని ప్రకారం చూస్తే, చైనా మార్కెట్‌ క్యాప్‌-టు-జీడీపీ ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. దీని వల్ల మనదేశంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?

చైనా మార్కెట్‌ క్యాప్‌-టు- జీడీపీ పెరగటం వల్ల ఎంఎస్‌సీఐ సూచీల్లో చైనా ఈక్విటీల వెయిటేజీ పెరుగుతుంది. తత్ఫలితంగా చైనా ఈక్విటీల్లోకి పెట్టుబడులు ప్రవాహం పెరగవచ్చు. కానీ మార్కెట్‌ క్యాప్‌-టు-జీడీపీ అనేది అంచనా విలువ మాత్రమే. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌ఓఈ) మాత్రమే చైనా కంపెనీల విలువలను నిర్ధారిస్తాయి. ఇటీవల కాలంలో పలు దేశాలు చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నాయి. టెలికామ్‌, ఇంటర్నెట్‌ ఉపకరణాలు చైనా నుంచి కొనుగోలు చేయటానికి ఇష్టపడటం లేదు. దీనివల్ల చైనా కంపెనీల మార్కెట్‌ విలువ తగ్గి మార్కెట్‌ కేపిటలైజేషన్‌ దిగిరావచ్చు. అదే సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ 'ప్రపంచ తయారీ కేంద్రం' నుంచి, అంతర్గత వినియోగ మార్కెట్‌గా మారుతోంది. దీనివల్ల సేవలు, వినియోగ రంగాల్లో చైనా కంపెనీలు ఎదిగే అవకాశం ఉంటుంది.

మూలధనాన్ని సమీకరించటం భారతీయ కంపెనీలకు ఎంతో కష్టంగా ఉంటుంది. అదే సమయంలో చైనా కంపెనీలకు ప్రభుత్వం ఎంత కావాలనుకుంటే అంత మూలధనాన్ని అందిస్తోంది. దీనివల్ల చైనా కంపెనీలు వేగంగా విస్తరించే అవకాశం కలుగుతోంది. దీన్ని అధిగమించడం ఎలా?

చైనాలో ప్రభుత్వ విధానాలు వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటున్నాయి. స్థానిక కంపెనీల ప్రయోజనాలను కాపాడటానికి చైనా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. కానీ ఇటీవల కాలంలో మనదేశంలోనూ మార్పులు వస్తున్నాయి. సులభతర వ్యాపార విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్‌, ఇంధన రంగాల్లో వేగవంతమైన వృద్ధి సాధించిన ఘనత మనకు ఉంది. అంతేగాక ప్రజాస్వామ్య వ్యవస్థ వల్ల స్థిరమైన వృద్ధి సాధనకు, స్వేచ్ఛగా ఎదిగేందుకు మనదేశంలో అవకాశాలు ఉన్నాయి.

మరోవిడత ఆర్థిక సంస్కరణలు చేపట్టనున్నట్లు ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించారు. అదే జరిగితే చైనా ఇంకా ముందుకు వెళ్లిపోతుంది. మనదేశం దాన్ని ఏ విధంగా అందుకోగలదు?

ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మన ప్రభుత్వం ఎన్నోచర్యలు తీసుకుంటోంది. కార్మిక సంస్కరణలు అమలు చేస్తోంది. ఫ్యాక్టరీల స్థాపనకు స్థలం లభ్యత పెంచుతోంది. పెట్టుబడులను ఆకర్షించటం లక్ష్యంగా మార్పులు తీసుకువస్తోంది. దీనివల్ల చైనా నుంచి బయటకు రావాలనుకునే కంపెనీలను మనదేశం ఆకర్షించగలుగుతుంది.

జీడీపీ మీద మార్కెట్‌ విలువ ఆధారపడి ఉంటుంది. మనం 2025 నాటికి 5 ట్రిలియన్‌ (లక్షల కోట్ల) డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావాలనుకుంటున్నాం. కానీ చైనా ఇప్పటికే 11 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. చైనాతో మనదేశాన్ని పోల్చుకోవటం సరైనదేనా?

కేవలం మార్కెట్‌ విలువ ఆధారంగా దేశాలను పోల్చి చూడటం సరైన విధానం కాదు. మార్కెట్‌ క్యాప్‌- టు- జీడీపీ పోలికతో దేశాల మధ్య అంతరాలు తెలుస్తాయి. కార్పొరేట్‌ సంస్థల ఆదాయాలు పెరగటం, పెట్టుబడులపై ప్రతిఫలం అధికంగా ఉండటంతో పాటు అధిక మార్కెట్‌ క్యాప్‌-టు- జీడీపీ ఉంటే, ఆ దేశంపై మదుపర్లు నమ్మకం ఉంచినట్లు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు సాగుతుందని అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్‌ కేపిటలైజేషన్‌ అంటే?

ఒక దేశంలో స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీల షేర్ల ధరల ప్రకారం, ఆ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువను 'మార్కెట్‌ కేపిటలైజేషన్‌' అంటారు. దీన్ని ఆ దేశంలో జీడీపీలో శాతంగా లెక్కిస్తారు. అదే మార్కెట్‌ క్యాప్‌-టు- జీడీపీ. ఏదైనా దేశానికి పెట్టుబడులను ఆకర్షించగల శక్తి ఏమేరకు ఉంది, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవటానికి మార్కెట్‌ క్యాపిటలైజషన్‌ను, మార్కెట్‌ క్యాప్‌-టు-జీడీపీని ఆర్థికవేత్తలు పరిగణనలోకి తీసుకుంటారు.

ఇదీ చూడండి: 'క్వాడ్' స్కెచ్​తో చైనాలో కంగారు- భారత్​పై ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.