ETV Bharat / business

సవాళ్ల పథంలో బడ్జెట్ రథం.. స్వప్నం సాకారమయ్యేనా? - Indian Budget Challenges

గత ఐదేళ్లలో ఎన్నడూలేనంతగా ఈ బడ్జెట్​కు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. భారత ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న సమస్యల నడుమ కొత్త బడ్జెట్​ వెలువడనుంది. పారిశ్రామిక, సేవారంగాల్లో వృద్ధిరేటు నెమ్మదిగా ఉంది. ఇక వ్యవసాయరంగం గురించి చెప్పలేనంత అధ్వానంగా ఉంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్​ను రాబోయే ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం ఎలా సాధ్యమవుతుందో? మన కల ఎంత వరకు సాకారమవ్వబోతుందో?

The Budget Chariot in the Challenge Scheme: Is the Dream Possible?
సవాళ్ల పథంలో బడ్జెట్ రథం: స్వప్నం సాకరమయ్యేనా?
author img

By

Published : Feb 1, 2020, 6:40 AM IST

Updated : Feb 28, 2020, 5:55 PM IST

డచిన అయిదేళ్లలో ఏ కేంద్ర బడ్జెట్‌కూ లేనంత ప్రాధాన్యం 2020-2021 బడ్జెట్‌కు ఉండబోతోంది. భారత ఆర్థికవ్యవస్థను పీడిస్తున్న సమస్యలు మరింత తీవ్రరూపం ధరించవచ్చుననే భయాల మధ్య కొత్త బడ్జెట్‌ వెలువడనుంది. ప్రస్తుతం పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధిరేటు మందకొడిగా ఉంది. వ్యవసాయ రంగాన్ని చూస్తే అది మరింత అధ్వానంగా ఉంది. ఇది చాలదన్నట్లు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఒక్కమాటలో భారత ఆర్థికాభివృద్ధి స్తంభించిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌ను వచ్చే అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందించడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న అంతటా మార్మోగుతోంది.

అయితే మోడువోయిన చెట్టు మళ్ళీ కొత్త చివుళ్లు తొడుగుతున్నట్లు ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఆశాకిరణాలు పొడసూపుతున్నాయి. ఈమధ్య పారిశ్రామికోత్పత్తి కాస్త పుంజుకోవడం ఒక ఆశావహ సూచన. ద్రవ్యోల్బణం విషయంలో మాత్రం అనిశ్చితి అలుముకొంటోంది. పశ్చిమాసియాలో ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెచ్చరిల్లితే మన ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడకమానదు. మరోవైపు రుతు పవనాలు ఆలస్యంగా రావడం, అనేక రాష్ట్రాల్లో వరదలు విరుచుకుపడటం వల్ల ఖరీఫ్‌ ఉత్పత్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగినా, రైతు చేతికి ఎక్కువ డబ్బు వచ్చి, గ్రామాల్లో వస్తుసేవల వినియోగం పుంజుకొంటుంది. దానివల్ల పరిశ్రమలు, సేవారంగం మెరుగుపడతాయి.

కొనుగోలు శక్తి పెంపే లక్ష్యం కావాలి...

వేగంగా మారిపోతున్న సాంకేతికత, ప్రభుత్వానికి, కంపెనీలకు, కుటుంబాలకు కొండలా పెరిగిపోయిన అప్పుల భారం, ప్రపంచ వాణిజ్యంలో ప్రకంపనలు కలగలసి భారత ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలను మార్చివేసే అవకాశముంది. ఈ మార్పు దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాల మధ్య భారత్‌ ఎలా నిలదొక్కుకుని కొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తుందనే అంశం రాగల కొన్ని సంవత్సరాల్లో చేపట్టే విధానాలు, కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత మందగతికి చాలానే కారణాలున్నా, వాటిలో పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం చాలా ముఖ్యమైనది. ఈ రెండు చర్యలు చేపట్టిన తరవాత మొదటి రెండు మూడేళ్లలో అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతినగా, సంఘటిత రంగం వృద్ధి నమోదు చేయగలిగింది. సంఘటిత రంగం కన్నా అసంఘటిత రంగమే అత్యధికంగా ఉపాధి వ్యాపార అవకాశాలను కల్పిస్తోంది. కాబట్టి అసంఘటిత రంగ విధ్వంసం దేశ ఆర్థిక వ్యవస్థను వెనక్కులాగింది. అసంఘటిత రంగంలో పెద్ద సంఖ్యలో జనం జీవనోపాధి కోల్పోవడంతో వస్తు సేవల వినియోగం దారుణంగా పడిపోయింది.

ఇలా గిరాకీ తగ్గిపోవడంతో ఉత్పత్తీ పతనమై మొత్తం ఆర్థిక వ్యవస్థ మందగతిలోకి జారిపోయింది. దీంతో సంఘటిత రంగంలోని పెద్ద కంపెనీలకూ విక్రయాలు, లాభాలు మందగించాయి. అందువల్ల కొత్త పెట్టుబడుల కోసం అవి రుణాలు తీసుకోవడం తగ్గించేశాయి. 2019 అక్టోబరు-నవంబరు మధ్యకాలంలో భారీ కంపెనీల రుణ స్వీకారం నాలుగు శాతం మేర దిగివచ్చింది. మరోవైపు కేంద్రం సబ్సిడీలను నియంత్రించడం వల్ల జనం చేతిలో డబ్బులు ఆడక వస్తుసేవలవినియోగం మరింత దెబ్బతింది. సబ్సిడీల కింద ఇచ్చే మొత్తం తగ్గిపోవడంతోపాటు వాటి రూపూ మారిపోతుంది. సబ్సిడీలను వస్తు రూపంలో కాకుండా నగదు రూపంలో నేరుగా లబ్ధిదారులకు చేరుతోంది. ఈ డబ్బును ఎలా వినియోగిస్తారన్న అంశమే ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

ఈ పరిస్థితిలో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి రెండు సంవత్సరాలు జనాకర్షక విధానాలపై డబ్బు వెదజల్లడం మాని పెట్టుబడులు పెంచడానికి ప్రాధాన్యమివ్వాలి. 2020-21 బడ్జెట్‌ ఈ పని చేస్తే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిన పడి, భవిష్యత్తులో అధిక వృద్ధి రేటును అందుకోగలుగుతుంది. ఎన్నికల ముందు ఒకటి రెండేళ్లపాటు అధికార పార్టీ మళ్ళీ పగ్గాలు చేపట్టడం కోసం సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేయడం వల్ల కొత్త పెట్టుబడులకు కొరత ఏర్పడుతుంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రభుత్వాలు అప్పు చేసి మరీ సంక్షేమంపై ఖర్చు చేస్తాయి. దీనివల్ల వస్తుసేవలకు గిరాకీ పెరుగుతుందనేది అపోహ మాత్రమే. పెరిగేవి అప్పులు మాత్రమే. రేపు బడ్జెట్‌ ప్రవేశపెట్టేటప్పుడు రుణ మాఫీలు, సబ్సిడీల పెంపు, పన్ను కోతల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి అధికమవుతుంది. దానికి తలొగ్గితే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలి. సుస్థిర ఆర్థిక భవిష్యత్తు కోసం పన్ను రాయితీలు ఇచ్చి, పెట్టుబడులను పెద్దయెత్తున ప్రోత్సహించి, కొత్త ఉపాధి వ్యాపార అవకాశాలను సృష్టించాలి.

అప్పుల భారాన్ని ఉన్న పళాన తగ్గించుకోవడం అంత తేలిక కాదు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించేవారికన్నా ఎగవేసేవారే అధికమైనప్పుడు పెను సమస్య వచ్చిపడుతుంది. నేడు భారతీయ బ్యాంకుల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) పెరిగిపోవడానికి కారణమిదే. ఎన్‌పీఏల సమస్య తీరకుండానే బ్యాంకులు కొత్త అప్పులు మంజూరు చేస్తే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకొంటుందనే అర్థం లేని వాదన ఒకటి వినిపిస్తూ ఉంటుంది. బ్యాంకులు మళ్ళీ కొత్త అప్పులు ఇస్తే తాత్కాలికంగా ప్రయోజనం కనిపించినా తరవాత మళ్ళీ పుట్టి మునిగిపోతుంది. ఇచ్చిన అప్పులు వాపసు రాకుండానే కొత్త అప్పులు ఇవ్వడమంటే ఊబిలో పోయడమే. రేపు అవసరమైనప్పుడు అప్పులు పుట్టకుండా పోతాయి, పెట్టుబడులూ స్తంభిస్తాయి. కంపెనీలు, కుటుంబాలతోపాటు కేంద్ర ప్రభుత్వమూ తాహతుకు మించి అప్పులు చేస్తుంది. ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తుంది.

గతేడాది పన్నుల ఆదాయం కేవలం 7.1 శాతం పెరగ్గా, ఖర్చులు 9.8 శాతానికి చేరుకున్నాయి. 2018-19 ఏప్రిల్‌-నవంబరు మధ్యకాలంతో పోలిస్తే 2019-20 అదే కాలంలో అప్పులు 17.1 శాతం పెరిగాయి. నేడు కేంద్ర ప్రభుత్వం నెలకు లక్ష కోట్ల రూపాయల చొప్పున అప్పులు చేస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్‌పీఏలతో కుంగిపోయిన బ్యాంకులు ఆదాయం కోసం వ్యక్తిగత రుణాల మంజూరును ఎక్కువ చేశాయని రిజర్వు బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఆర్థిక మందగతిలో వ్యక్తుల ఆదాయాలు పడిపోతున్న దశలో వారికి రుణ మంజూరును పెంచడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

ఇప్పటికీ వ్యాపారం మెరుగుపడని పరిస్థితిలో కంపెనీలకూ కొత్త రుణాలివ్వడం వల్ల ఉపయోగం ఉండదు. సగానికి పైగా పెద్ద రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోయినందువల్ల వాటికి రుణాలు ఇవ్వడం విరుద్ధ ఫలితాలను ఇస్తుంది. అందువల్ల ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్ట నిబంధనలను సడలించి రాష్ట్రాలకు ఎక్కువ రుణాలు ఇవ్వడం అభిలషణీయం కాదు. కేంద్రం రుణ వితరణ పెంచాలనుకుంటే వినియోగ సబ్సిడీల కోసం కాకుండా మౌలిక వసతుల నిర్మాణం కోసం ఇవ్వాలి. దీనివల్ల వృత్తిఉపాధులు, ప్రభుత్వానికి ఆదాయం లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి మెరుగుదలకు ఊతం లభిస్తుంది. రుణ వితరణపై ఇలాంటి ఆంక్షలు లేకపోతే రాష్ట్రాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎడాపెడా డబ్బు పంపిణీ చేసి భవిష్యత్తును గాలికి వదిలేసే ప్రమాదం ఉంది.

సాగుకు ఊతమిస్తేనే...

భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలంటే దేశ జీడీపీ ఏటా ఎనిమిది శాతానికిపైగా వృద్ధిరేటు సాధించాలి. వ్యవసాయ రంగం అయిదు శాతం వార్షిక వృద్ధిరేటును సాధిస్తేనే జీడీపీ వృద్ధి ఎనిమిది శాతానికి చేరుతుంది. దురదృష్టమేమిటంటే ఈ ఏడాది ఖరీఫ్‌ ఉత్పత్తి అంతకుముందు సంవత్సరాలకన్నా తక్కువగా ఉండబోవడం. పాల ఉత్పత్తీ తగ్గుముఖం పట్టింది. పీఎం కిసాన్‌ యోజన కింద రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మినహాయిస్తే, ప్రస్తుతం వ్యవసాయ రంగంపై ఖర్చు జీడీపీలో మూడు శాతమే ఉంది. దీన్ని ఈ బడ్జెట్‌తో మొదలుపెట్టి క్రమంగా అయిదు శాతానికి చేర్చాలి. రాగల అయిదేళ్లలో ఏటా 0.25 నుంచి 0.5 శాతం చొప్పున పెంచుకుంటూ పోతే చివరకు అయిదు శాతం జీడీపీని వ్యవసాయంపై వెచ్చించగలుగుతాం.

1970ల నుంచి 1990ల వరకు వ్యవసాయానికి ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల రైతుల జీవితాలు ఎంతో మెరుగుపడ్డాయి. మళ్ళీ ఆనాటి విధానాలను చేపట్టడం అవసరం. పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తి పెంచడం, వ్యవసాయ విస్తరణ సేవలను ప్రోత్సహించడం ముఖ్యం. దీనివల్ల రైతులఆదాయాలు మెరుగుపడతాయి. నానాటికీ విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలకు పాల సరఫరా పెరిగి, ఆహార వస్తు ధరలు అదుపులో ఉంటాయి. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు స్వతంత్రంగా చొరవ తీసుకోలేకున్నాయి. సబ్సిడీలపై ధనం వ్యయంచేసేకన్నా వ్యవసాయాభివృద్ధికి అగ్రాసనం వేయడం ఉత్తమం. కేంద్ర బడ్జెట్‌ ఈ సంగతి గుర్తుంచుకుని తగు విధంగా కేటాయింపులు పెంచాలి.

పరిశోధనలతో ప్రగతి...

The Budget Chariot in the Challenge Scheme: Is the Dream Possible?
పరిశోధనలతో ప్రగతి

పరిశోధన-అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించి, తద్వారా చేకూరే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పాదకతను పెంచినప్పుడు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ హెచ్చు ప్రతిఫలం లభిస్తుంది. జపాన్‌, దక్షిణ కొరియాలు ఈ బాటలోనే అద్భుత ఫలితాలు సాధించాయి. భారత ప్రభుత్వమూ ఉత్పాదకతను పెంచే కార్యక్రమాలకు ఎక్కువ నిధులు వెచ్చించేట్లు రాష్ట్రాలను ఆదేశించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల జీతభత్యాల పెంపుదలను ఉత్పాదకతతో ముడిపెడుతూ- విశ్వవిద్యాలయాలు, కళాశాలలకూ ఇదే సూత్రం వర్తింపజేయాలి. పేటెంట్లు, ట్రేడ్‌ మార్కులు, డిజైన్లు, పరిశ్రమలకు సలహా సంప్రతింపులు అందించే విద్యాసంస్థలకు ఆర్థిక సహాయం పెంచాల్సి ఉంది. తద్వారా విద్యాలయాల స్థాయి నుంచే సృజనాత్మకత, ఉత్పాదకతలకు ప్రాధాన్యమివ్వాలి. అన్నింటినీ మించి పేటెంట్లు, డిజైన్లను వాణిజ్య ప్రాతిపదికపై అమలులోకి తీసుకురావడం ముఖ్యం. ఈ విధమైన చొరవ కనబరచే అధ్యాపక సిబ్బందికి హెచ్చు ప్రోత్సాహకాలివ్వాలి.

- డాక్టర్​ ఎస్​. అనంత్​, రచయిత, ఆర్థిక సామాజిక రంగ నిపుణులు

ఇదీ చదవండి: 'ప్లాస్టిక్ భూతం'​ వద్దు.. 'జనపనార' ముద్దు!

ZCZC
PRI ESPL NAT NRG
.NOIDA DES46
NCR-JAMIA-BAJRANG DAL
Bajrang Dal says Jamia shooter not its member, condemns violence

         Noida (UP), Jan 31 (PTI) Right wing organisation Bajrang Dal on Friday said the shooter who opened fire at anti-citizenship law protesters in Delhi's Jamia Nagar was not its member and condemned the "unfortunate" act.
         Tension spiralled in Jamia Nagar on Thursday after the class 12 student from Jewar town in Gautam Buddh Nagar district of Uttar Pradesh fired a pistol at a group of anti-Citizenship (Amendment) Act (CAA) protesters, injuring a Jamia Millia Islamia student.
         Identifying himself as "Rambhakt Gopal", he waved the firearm above his head and shouted "yeh lo aazadi" before being overpowered by the police and detained.
         The attacker, in a since deleted Facebook profile, shared multiple posts berating the anti-CAA agitators and their aazadi slogans and hinted that he was prepared for any eventuality.
         In one of the messages, he said, "Shaheen Bhag Khel Khatam" (Run Shaheen, the game is over) while in another he stated, "Please wrap me in saffron in my last journey with slogans of Jai Shri Ram". Screenshots of his posts were circulated widely on social media platforms.
         Anti-CAA protesters at Delhi's Shaheen Bagh, Zakir Nagar, Jamia Nagar, Khureji Khas and other places often raise slogans like "CAA se aazadi, NRC se aazadi" (freedom from CAA and NRC).
         "The boy is neither a primary member of the Bajrang Dal nor was he entrusted with any responsibility by the organisation. Violence, committed by anyone, is not correct. We condemn his act and it was an unfortunate incident," Praveen Bhati, co-convenor of the Bajrang Dal's western Uttar Pradesh unit, said.
         The Delhi Police had said on Thursday that they were yet to ascertain the shooter's real name and age, even though the pictures of his purported marksheet and Aadhaar card, hinting that he is a minor, were circulated on social media. PTI KIS
RHL
01312210
NNNN
Last Updated : Feb 28, 2020, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.