ETV Bharat / business

'ఆర్​బీఐ సాహసోపేత నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు దన్ను'

ఆర్బీఐ వడ్డీరేట్ల కోత నిర్ణయాన్ని స్వాగతించారు ప్రధాని నరేంద్రమోదీ. కరోనా ప్రభావం నుంచి బయటపడేందుకు ఆర్బీఐ ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. కీలక వడ్డీరేట్లలో కోత నిర్ణయం వల్ల దేశానికి ఆర్థిక స్థిరత్వం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్.

economy
'ఆర్బీఐ సాహస నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు దన్ను'
author img

By

Published : Mar 27, 2020, 12:55 PM IST

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేలా రిజర్వు బ్యాంకు తీసుకున్న కీలక నిర్ణయాలను స్వాగతించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఆర్​బీఐ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు. తాజా నిర్ణయం కారణంగా దేశంలో నగదు ప్రవాహం పెరుగుతుందని.. మధ్యతరగతి వారికి మేలు చేకూరుతుందని విశ్లేషించారు మోదీ.

modi tweet
నరేంద్రమోదీ ట్వీట్

'ఆర్​బీఐ విధానంతో ఆర్థిక స్థిరత్వం'

తాజా నిర్ణయంతో దేశానికి ఆర్థిక స్థిరత్వం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్. రుణాలు, మూలధనంపై మూడు నెలలపాటు వడ్డీని రద్దు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు.

nirmala tweet
నిర్మలా సీతారామన్ ట్వీట్​

భారత స్థూల ఆర్థిక విధానాలు బలమైనవన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను సమర్థించారు నిర్మల. 2008 నాటి ఆర్థిక మాంద్యాన్ని తట్టుకుని నిలబడ్డామన్న ఆర్​బీఐ గవర్నర్ వ్యాఖ్యలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

'సరైన నిర్ణయం..'

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తీసుకున్న కీలక రేట్లలో కోత, మూడు నెలలపాటు మారటోరియం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. ఆర్బీఐ గవర్నర్ గవర్నర్​ నిర్ణయం ప్రగతిశీల, సమయోచితమైనదని అభిప్రాయపడ్డారు. భారత్ త్వరలోనే కరోనా గండం నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: '2020లో భారత వృద్ధి రేటు 2.5 శాతమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.