ETV Bharat / business

'బడ్జెట్‌ సంస్కరణలతో 5 ట్రి.డాలర్ల ఆర్థిక వ్యవస్థ' - భారత్​లో ఆర్థిక సంస్కరణలు

2021-22 బడ్జెట్​లో ప్రకటించిన సంస్కరణలతో భారత్​.. 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 15.5 శాతం మేర పుంజుకుంటుందని చెప్పారు.

k.v.subramaniyan about budget 2021-22
'బడ్జెట్‌ సంస్కరణలతో 5 ట్రి.డాలర్ల ఆర్థిక వ్యవస్థ'
author img

By

Published : Feb 13, 2021, 5:44 PM IST

బడ్జెట్‌ 2021-22లో ప్రకటించిన సంస్కరణలు.. భారత్‌ను ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వృద్ధి రేటు 1-2 శాతం కుంగే అవకాశం ఉందన్న ఆయన.. 2021-22లో 15.5 శాతం మేర పుంజుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే కంటే కూడా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) సంస్థ భారత వృద్ధి రేటు అంచనాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా సుబ్రమణియన్‌ గుర్తుచేశారు.

భారత్​ అత్యంత వేగంగా..

కొవిడ్‌ మూలంగా ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధి రేట్లు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. భారత్‌ మాత్రం అన్నింటికంటే వేగంగా, బలంగా తిరిగి పూర్వస్థితిని చేరుకోనుందని పేర్కొన్నారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఓ ప్రభుత్వ రంగ బీమా సంస్థ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగనుందని తెలిపారు. ఇది ప్రవేటు సంస్థలతో పోటీ పడనుందని తెలిపారు. వచ్చే ఏడాది కల్లా ప్రభుత్వం నిర్దేశించిన 6.8 శాతం కోశలోటు లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

అప్పుడు ద్రవ్యోల్బణం పెరిగింది..

భారత్‌ ఇప్పటి వరకు 1997, 2007-2008, 2020లో.. మొత్తం మూడు సార్లు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొందని సుబ్రమణియన్‌ గుర్తుచేశారు. 2007-08లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో నాటి ప్రధాని మన్మోహన్‌ ప్రభుత్వం ఆదాయ వ్యయాన్ని పెంచి మూలధన వ్యయాన్ని తగ్గించిందని తెలిపారు. దీనివల్ల గిరాకీ వైపు మాత్రమే దన్ను లభించిందని పేర్కొన్నారు. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని వివరించారు.

ఇదీ చదవండి:దేశీయ దిగుబడి పెంచితేనే నూనె ధరలు దిగొచ్చేది!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.