ETV Bharat / business

పద్దు 2019: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?

author img

By

Published : Jun 30, 2019, 4:59 PM IST

జులై 5న కేంద్రం పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. సామాన్యులకు ఎలాంటి వరాలు కురిపించనుంది..? రైతుల కోసం ఏం చేస్తుంది..? వంటి ప్రశ్నలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే.. బడ్జెట్​ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. ఆర్థిక శాఖ మంత్రి చేతిలోని సూట్​కేసు.

పద్దు 2019: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?
పద్దు 2019: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?

ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మరికొద్ది రోజుల్లో బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది. దిల్లీ నార్త్​బ్లాక్​లో బడ్జెట్​ పత్రాల ముద్రణ జరుగుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి... బడ్జెట్​ ప్రతులను లెదర్​ సూట్​కేసులో పెట్టుకొని పార్లమెంటులో అడుగుపెడుతారు.

ఈ సూట్​కేస్​కు ఓ చరిత్ర ఉందని తెలుసా? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? కాలక్రమేణా రంగులు, పరిమాణంలో మార్పుల గురించి విన్నారా? అసలు ఈ బడ్జెట్​కు, లెదర్ సూట్ కేసుకు సంబంధం ఏమిటో తెలుసా...?

ఫ్రెంచ్​ నుంచి వాడుకలోకి...

బడ్జెట్​ను ఫ్రెంచ్​ భాషలో బోగెటి అంటారు. దీని ఇంగ్లీష్​ అర్థమే లెదర్​ బ్యాగ్​.

1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్​స్టోన్ మొదట లెదర్ బ్యాగ్​లో పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

బ్రిటిష్​ సంప్రదాయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి ఈ లెదర్​ సూట్​కేసులో ఉంటుంది. అందుకే.. మంత్రి చేతిలో ఉండే ఈ సూట్​కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే.. ఆ బ్రీఫ్​కేసును తెచ్చే సంప్రదాయం మారకపోయినా.. దాని రంగులు మాత్రం మారుతూ వచ్చాయి.

ఈ సూట్​కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖనే సేకరిస్తోంది. విభిన్న రంగుల్లోని నాలుగు బ్యాగ్​లను ఆర్థిక మంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.

నలుపు నుంచి..

  1. భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్​కే శన్ముఖమ్​ చెట్టీ 1947లో లెదర్​ బ్యాగ్​ వినియోగించారు.
  2. 1956-58, 1964-66 సమయంలో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్​ బ్యాగ్​తో పార్లమెంటులో అడుగుపెట్టారు.
  3. 1958లో జవహర్​లాల్​ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్​కేసు వాడారు.

1970ల తర్వాతే..

ఆర్థిక మంత్రి యశ్వంత్​ సిన్హా.. ఎరుపు రంగుకు దగ్గరగా ఉన్న బడ్జెట్​ బాక్స్​తో వచ్చారు.

మన్మోహన్​ సింగ్​.. బ్రిటన్​ తొలి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్​ గ్లాడ్​స్టోన్ వినియోగించిన బ్రీఫ్​కేస్​ను పోలిన నలుపు రంగు బ్యాగ్​ వాడారు.

ప్రణబ్​ ముఖర్జీ అందరిలా కాకుండా... చెర్రీ ఎరుపు రంగు సూట్​కేసులో బడ్జెట్​ పత్రాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా నిలిచారు.

బ్రిటన్​ మాజీ ప్రధాని గ్లాడ్​స్టోన్​ తరహాలో.. సాదా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు బ్రీఫ్​కేసుల్ని వినియోగించారు చిదంబరం.

మోదీ-1 హయాంలో.. ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు గోధుమ రంగు, లేత గోధుమ రంగు బ్యాగ్​లు వాడారు. 2017లో ముదురు గోధుమ రంగు బ్యాగ్​ వాడారు.

2019 ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి హోదాలో పీయూష్ గోయల్ ఎరుపు రంగు సూట్​కేసుతో పార్లమెంట్​లోకి అడుగుపెట్టారు.

జులై 5న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్​లో ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఏ రంగు సూట్​కేస్​తో పార్లమెంటులో అడుగుపెడతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Mumbai, June 30 (ANI): Actress Esha Gupta underlined the corruption in justice system in Mumbai on Saturday. While interviewing for her upcoming film 'One Day: Justice Delivered', Esha said, "Nowadays, people became money minded. They only talk business, be it in justice system or any other. She further said, "Still there is some people left who work and fight for common people's justice and the movie is all about them". The film revolves around a Special Crime Branch officer played by Esha Gupta, who investigates the disappearance of several high-profile individuals. Actor Anupam Kher plays the role of a retired high court judge who tries to deliver justice out from the rule books. The film's tagline states, 'Where's there is justice, there will be victory' which seems like the base of the movie and rightly sets the tone for the film's subject. Film is helmed by Ashok Nanda and produced by Ketan Patel and Swati Singh.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.