కరోనా నేపథ్యంలో ప్రజల ఆదాయం తగ్గడం వల్ల.. ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పడిపోయాయి. దీనితో దేశీయ పన్ను వసూళ్ల నిష్పత్తిల్లో కీలక మార్పులు వచ్చాయి.
వస్తు, సేవలపై విధించే పన్ను, దిగుమతి సుంకాల వంటి పరోక్ష పన్నుల్లో వృద్ధి నమోదైనప్పటికీ.. కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయపు పన్నులు మాత్రం గత ఏడాది భారీగా తగ్గాయని ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడిచారు.
'ఆర్థిక వ్యవస్థ ప్రభావితమై.. రికవరీ దశలో ఉన్నప్పుడు ఆదాయపు పన్నులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఎందుకంటే కంపెనీల ఆదాయాలు, టర్నోవర్లు ఎప్పుడూ అనులోమాను పాతంలో ఉంటాయని చెప్పలేం. టర్నోవర్ బెంచ్మార్క్ దిగువకు చేరితే కంపెనీలకు లాభాలే ఉండవు. అప్పుడు వాటికి పన్ను చెల్లించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు.' అని అజయ్ భూషణ్ పాండే వివరించారు.
ఇదే విధంగా రికవరీ దశలో ఉన్నప్పుడు.. కంపెనీలు లాభాదాయ జోన్లోకి వచ్చి ఆదాయపు పన్ను చెల్లించేందుకు సాధారణం కన్నా ఎక్కువ సమయం పట్టొచ్చని పేర్కొన్నారు.
పన్ను వసూళ్ల అంచనాలు..
2020లో ఎంత మొత్తం ప్రత్యక్ష, పరోక్ష పన్నులు గణాంకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. పరిశ్రమ వర్గాల ప్రకారం.. పరోక్ష పన్ను వసూళ్లు గత ఏడాది 56 శాతానికి పెరిగాయి. గడిచిన దశాబ్దకాలంలో ఇవే అత్యధికం కావడం విశేషం. ఇదే సమయంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 26 శాతం నుంచి 27 శాతం వరకు క్షీణించినట్లు అంచనా.
ప్రత్యక్ష పన్నులు ఆదాయ స్థాయిలకు అనుగుణంగా ఉంటాయి. పరోక్ష పన్నులు మాత్రం ఎక్కువగా.. వినియోగం, డిమాండ్ వంటివి వాటిపై ఆధారపడి ఉండాయి.
పెట్రోల్, డీజిల్పై రూ.13, రూ.10 చొప్పున పన్నులు పెంచడం వల్ల.. 2020లో ఎక్సైజ్ సుంకాల ఆదాయం భారీగా పెరిగింది. దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే కస్టమ్స్ సుంకాలు కూడా గత ఏడాది నవంబర్, డిసెంబర్లో పుంజుకున్నాయి. మొత్తం మీద వీటి ద్వారా వచ్చే ఆదాయం డిసెంబర్లో 94 శాతం పెరిగి 16,157 కోట్లుగా నమోదైంది. నవంబర్లో ఇది 43 శాతం వృద్ధితో రూ.11,598 కోట్లుగా ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి:ఈఎంఐ కట్టలేని స్థితికి 80% ఎంఎస్ఎంఈలు!