ETV Bharat / business

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 31 శాతం లాక్​ 'డౌన్'​

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా తగ్గాయి. 2020-21 తొలి త్రైమాసికం.. జూన్ 15 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 31 శాతం క్షీణించినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.

author img

By

Published : Jun 16, 2020, 4:58 PM IST

tax collection down due to lock down
లాక్​డౌన్​తో భారీగా తగ్గిన పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(జూన్​ 15 నాటికి)లో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 31 శాతం తగ్గాయి. ఇదే సమయానికి కార్పొరేట్ల అడ్వాన్స్​ ట్యాక్స్​లు ఏకంగా 79 శాతం తగ్గినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. అడ్వాన్స్ ట్యాక్స్​ల చెల్లింపునకు జూన్​ 15నే గడువు ముగిసినట్లు వెల్లడించింది.

వసూళ్లు లెక్కలు..

జూన్ 15 నాటికి ప్రత్యక్ష స్థూల పన్నుల వసూళ్లు రూ.1,37,825 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.1,99,755 కోట్లుగా ఉండటం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటి రెండు నెలలు దాదాపు లాక్​డౌన్​లో ఉండిపోయాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా 80 శాతం ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పన్ను వసూళ్లు తగ్గినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

ఈ నెల ఆరంభం నుంచి లాక్​డౌన్ సడలింపులు ఇచ్చినా.. ఆర్థిక వ్యవస్థ తెరుకునేందుకు ఇంకా సమయం పట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:ఆ వాహన సంస్థలో 1,000 ఉద్యోగాలు కోత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.